టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో భారత్-పాకిస్థాన్‌లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఆ తర్వాత.. చరిత్ర సృష్టిస్తూ నీరజ్ చోప్డా(Neeraj Chopra) పసిడిని ముద్దాడాడు. పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్(Arshad Nadeem javelin).. 5వ స్థానంలో నిలిచాడు. అయితే ఫైనల్ అనంతరం నదీమ్‌తో తాను ఏం మాట్లాడాననే విషయాన్ని నీరజ్.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. వచ్చే ఒలింపిక్స్ కోసం కష్టపడాలని సూచించినట్లు చెప్పాడు.
"పతకం సాధించాలంటే.. ఆ సమయంలో కొంత అదృష్టం కూడా ఉండాలి. మేమిద్దరం ఫైనల్‌కి వెళ్లడం సంతోషాన్ని ఇచ్చింది. ఇదే విషయం నదీమ్‌కు కూడా చెప్పాను. జావెలిన్‌లో ఆసియా అథ్లెట్లు మంచి ప్రదర్శన చేయడం చాలా అరుదు. ఆధిపత్యం అంతా యూరోపియన్ అథ్లెట్లదే. తొలిసారి ఇండియా- పాకిస్థాన్ ఫైనల్‌కు వెళ్లాయి. కష్టపడి అక్కడి వరకు వెళ్లాము. నదీమ్‌కు మెడల్ రాలేదు. వచ్చే ఒలింపిక్స్ కోసం కష్టపడు, ఆల్ ది బెస్ట్ అని నేను నదీమ్‌కు చెప్పాను."
- నీరజ్ చోప్డా, అథ్లెట్.