తెలంగాణ

telangana

ETV Bharat / sports

Tokyo paralympics: 'ఒత్తిడి వద్దు.. పతకాలు అవే వస్తాయి' - టోక్యో ఒలింపిక్స్​ పారా అథ్లెట్స్​

పారా ఒలింపిక్స్​లో పాల్గొనే భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు. ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే టోక్యోలో అత్యుత్తమ ప్రదర్శన చేస్తామని ఆటగాళ్లు ధీమా వ్యక్తం చేశారు. ఆగస్టు 24 నుంచి సెప్టంబర్ 5 వరకు పారాలింపిక్స్ (Tokyo paralympics) జరగనున్నాయి.

pm modi para athletes
Tokyo paralympics: అథ్లెట్లతో ముచ్చటించిన ప్రధాని మోదీ

By

Published : Aug 17, 2021, 1:54 PM IST

Updated : Aug 17, 2021, 3:04 PM IST

టోక్యో వేదికగా జరగనున్న పారాలింపిక్స్​లో (Tokyo paralympics) పాల్గొననున్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు. ఆటగాళ్లు పోటీల్లో బాగా రాణించాలన్న ప్రధాని.. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడాలని అథ్లెట్లకు సూచించారు. ఈ సందర్భంగా షూటర్​ జ్యోతి బాలన్​ను అభినందించారు ప్రధాని.

"మీకు ఒలింపిక్స్​లో పాల్గొనడం ఇదే తొలిసారి. తల్లిదండ్రులు మీకోసం ఎంతో చేశారు. మీరు ఎంతో మందికి ఆదర్శం" అని జ్యోతి బాలన్​ను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

అథ్లెట్లతో ముచ్చటిస్తున్న ప్రధాని

"నా తండ్రి ప్రోత్సాహంతోనే నేను పారాలిపింక్స్​లో పాల్గొనే స్థాయికి చేరుకున్నా. కానీ ఆయన ఇప్పుడు లేనందుకు బాధగా ఉంది. నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. నా కోచ్​ నాకు అండగా నిలిచారు. కచ్చితంగా పతకం సాధించాలనే లక్ష్యంతో ఒలింపిక్స్​కు వెళ్తున్నా."

-జ్యోతి బాలన్​, పారా షూటర్

"పారా అథ్లెట్లను మీరు ఎప్పుడు ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇప్పుడు మేము మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం. బాల్యంలో నన్ను క్రీడలు మాని చదువుకోమని బలవంతం చేశారు.. కానీ నేను దానిని ఓ సవాల్​గా స్వీకరించా. రియో 2016లో మెడల్​ సాధించాక చాలా సంతోషపడ్డాను."

-దేవేంద్ర జజారియా, జావెలిన్​ త్రో అథ్లెట్

"2011 నుంచి నేను దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చా. ఇప్పుడు మరోసారి దేశం గర్వపడేలా చేసేందుకు అవకాశం వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అథ్లెట్లు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకూడదు."

-మరియప్పన్ తంగవేలు, అథ్లెట్

పారాలింపిక్స్​లో మొత్తం 9 క్రీడల్లో 54 మంది భారత పారా అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ పోటీల్లో భారత్​ తరపున ఇంత మంది అథ్లెట్లు పాల్గొనడం ఇదే తొలిసారి. ఆగస్టు 24 నుంచి సెప్టంబర్ 5 వరకు పారాలింపిక్స్​ జరగనున్నాయి.

ఇదీ చదవండి :Tokyo Paralympics: ప్రేక్షకులు లేకుండానే పోటీలు

Last Updated : Aug 17, 2021, 3:04 PM IST

ABOUT THE AUTHOR

...view details