తెలంగాణ

telangana

ETV Bharat / sports

Tokyo Olympics: రెజ్లర్లకు నిరాశ.. వినేశ్, అన్షు మాలిక్ ఓటమి - ఒలింపిక్స్​

టోక్యో ఒలింపిక్స్​ క్వార్టర్​ ఫైనల్లో ఓటమి చవిచూసింది స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్. అయితే అప్పుడే ఆమె పోరు ముగిసిపోలేదు. కాంస్యం కోసం పోరాడేందుకు ఆమెకు మరో అవకాశం లభించే వీలుంది. అలాగే మరో రెజ్లర్ అన్షు మాలిక్ కూడా పరాజయం చెందింది.

tokyo olympics
వినేశ్​ పొగాట్

By

Published : Aug 5, 2021, 10:19 AM IST

Updated : Aug 5, 2021, 10:28 AM IST

భారత స్టార్​ రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్ 53కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. బెలారస్ క్రీడాకారిణి వనేసా చేతిలో పరాజయం చెందింది. అయినప్పటికీ టోక్యోలో ఆమెకు మరో అవకాశం ఉంది. ఒకవేళ వనేసా ఫైనల్ చేరితే వినేశ్​కు రెపిచేజ్ రౌండ్​లో పోటీపడే వీలుంటుంది.

ముగిసిన అన్షు పోరు..

అన్షు మాలిక్

మహిళల 57 కేజీల ఫ్రీ స్టైల్​ రెజ్లింగ్​ విభాగంలో అన్షు మాలిక్ రెపిచేజ్​ రౌండ్​లో ఓటమి పాలైంది. రష్యన్ ఒలింపిక్స్ కమిటీ క్రీడాకారిణి వలెరియా కొబ్లోవా చేతిలో పరాజయం చెందింది. దీంతో పతకం సాధించకుండానే విశ్వక్రీడల నుంచి వెనుదిరిగింది.

ఇదీ చూడండి:తీరిన 41 ఏళ్ల కల.. టోక్యో ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టుకు కాంస్యం

Last Updated : Aug 5, 2021, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details