భారత రెజ్లింగ్‌కు మంచి రోజులొచ్చాయి. కుస్తీకి అండగా నిలవాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 2032 ఒలింపిక్స్ వరకు భారత రెజ్లింగ్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. హాకీకి ఒడిశా ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్లే రెజ్లింగ్‌ను యూపీ ప్రభుత్వం దత్తత తీసుకుంది. 2032 వరకు మౌలిక వసతులు, రెజ్లర్ల శిక్షణ కోసం సుమారు రూ.170 కోట్లు ఖర్చు పెట్టనుంది.
"ఒడిశా చిన్న రాష్ట్రం. అయినా హాకీకి గొప్పగా మద్దతు ఇస్తుంది. ఇంత పెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్ అలాంటి పని ఎందుకు చేయకూడదు అని అనిపించింది. ప్రభుత్వాన్ని సంప్రదించాం. మా ప్రతిపాదనకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆమోదం తెలిపారు"