తెలంగాణ

telangana

ETV Bharat / sports

Tokyo Paralympics: టోక్యో చేరుకున్న అఫ్గాన్​ క్రీడాకారులు - పారా అథ్లెట్లు అఫ్గానిస్థాన్

టోక్యో పారాలింపిక్స్​లో(Tokyo paralympics) పోటీ పడేందుకు ఆఫ్గాన్​ క్రీడాకారులు సిద్ధమయ్యారు. ఆ దేశ అథ్లెట్లు కాబుల్‌ నుంచి పారిస్‌కు .. అక్కడి నుంచి క్రీడాగ్రామం చేరుకున్నారు. ఒకరు తైక్వాండోలో పోటీపడుతుండగా.. మరొకరు 400 మీటర్ల పరుగులో బరిలో ఉన్నారు.

tokyo paralympics
Tokyo paralympics: టోక్యోకు ఇద్దరు అఫ్గాన్‌ క్రీడాకారులు

By

Published : Aug 29, 2021, 7:03 AM IST

ఒకవైపు స్వదేశం అల్లకల్లోలంగా ఉన్నా ఇద్దరు అఫ్గానిస్థాన్‌ క్రీడాకారులు పారాలింపిక్స్‌లో (Tokyo paralympics) పోటీపడుతున్నారు. ఆ దేశ అథ్లెట్లు జకియా ఖుదాది, హుస్సేన్‌ రసౌలీ శనివారం క్రీడా గ్రామానికి చేరుకున్నారు. వీళ్లిద్దరు కాబుల్‌ నుంచి పారిస్‌కు.. అక్కడి నుంచి టోక్యోకు వచ్చారు. జకియా మహిళల తైక్వాండో(44-49 కిలోల విభాగం)లో పోటీపడుతుండగా.. హుస్సేన్‌ 400 మీటర్ల పరుగు బరిలో ఉన్నాడు. 2004 ఏథెన్స్‌ పారాలింపిక్స్‌ తర్వాత అఫ్గాన్‌ తరఫున పోటీపడుతున్న తొలి మహిళా అథ్లెట్‌ జకియానే కావడం విశేషం.

ఏం జరిగిందంటే?

ఇటీవల జాకియా ఖుదాదాది ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తన దేశం తరఫున పారాలింపిక్స్​లో ప్రాతినిధ్యం వహించాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది. దాని కోసం ఆమె ప్రపంచదేశాల సాయాన్ని కోరింది. అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​ను తాలిబన్లు అక్రమించుకున్న తర్వాత అంతర్జాతీయ విమాన సేవలు రద్దయ్యాయి. దీంతో పారాలింపిక్స్​లో పాల్గొనేందుకు అథ్లెట్లకు ప్రయాణించే అవకాశం లేకపోయింది. దీంతో ఆ దేశ క్రీడాకారులు విశ్వక్రీడల్లో పాల్గొనే అవకాశంపై సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఎట్టకేలకు వారు పారాలింపిక్స్​లో బరిలోకి దిగుతున్నారు.

ఇదీ చదవండి :INDvsENG: మూడో టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాజయం

ABOUT THE AUTHOR

...view details