టోక్యో ఒలింపిక్స్‌లో పారాలింపియన్ షూటర్ నరేశ్ కుమార్ శర్మకు అదనపు స్లాట్ బుక్ చేసేందుకు నిర్వాహకులు అంగీకరించలేదని పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా(పీసీఐ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. పారాలింపిక్స్ కోసం ఉద్దేశించిన 10 స్లాట్లలో 8 మంది పురుషులు, ఇద్దరు మహిళలను ఇప్పటికే ఎంపికచేసినట్లు న్యాయస్థానానికి వెల్లడించింది.
దీంతో నరేశ్ కుమార్ శర్మకు టోక్యోలో అవకాశం ఇవ్వలేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పారాలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లు ఇప్పటికే బయోబబుల్‌లో ఉన్నట్లు పీసీఐ పేర్కొందని తెలిపింది.
అయితే సెలక్షన్ విషయంపై తాము జోక్యం చేసుకోబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఏది ఏమైనా ఈ విషయంలో అవసరమైతే చర్యలు తీసుకునే అధికారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు ఉందని చెప్పింది.