టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని ఖరారు చేసింది టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవినాబెన్ పటేల్. శుక్రవారం జరిగిన పారాలింపిక్స్ మహిళల సింగిల్స్ క్లాస్-4 క్వార్టర్స్‌ఫైనల్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవినాబెన్ పటేల్ చరిత్ర సృష్టించింది. 3-0 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్ బొరిస్‌లవ పెరిక్ రంకోవిచ్ (సెర్బియా)ను మట్టికరిపించింది. ఫలితంగా సెమీస్‌కు చేరిన తొలి భారత ప్యాడ్లర్‌గా రికార్డుకెక్కింది.
కేవలం 18 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వరుసగా 11-5,11-6,11-7తేడాతో మూడు గేముల్లో విజయం సాధించింది భవినా.