పారాలింపిక్స్‌లో(Tokyo Paralympics) పాల్గొనేందుకు టోక్యోకు చేరుకున్న భారత బృందానికి ఊహించని షాక్ ఎదురైంది. భారత హైజంప్ క్రీడాకారుడు మరియప్పన్ తంగవేలుపై(Mariyappan Thangavelu) కరోనా ప్రభావం పడింది. భారత్ నుంచి టోక్యోకు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకగా.. అతడితో తంగవేలు సన్నిహితంగా ఉన్నాడు. దీంతో ఆరంభ వేడుకల్లో భారతదేశ జెండాను చేతపట్టాల్సిన అవకాశాన్ని తంగవేలు చేజార్చుకున్నట్లు అయ్యింది. దీంతో మరియప్పన్ స్థానంలో జావెలిన్ త్రోవర్ టెక్ చంద్(Athlete Tek Chand) తివర్ణ పతాకాన్ని చేతబూని నడవనున్నాడు.
2016 రియో పారాలింపిక్స్ హైజంప్ క్రీడలో స్వర్ణం సాధించిన మరియప్పన్ తంగవేలుకు.. 2017లో పద్మశ్రీ, అర్జున పురస్కారాలతో కేంద్రప్రభుత్వం సత్కరించింది. గతేడాది మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డునూ అందుకున్నాడు.