టోక్యో ఒలింపిక్స్లో రజతంతో మెరిసిన మీరాబాయి చాను ఆనందం డబుల్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఈ వెయిట్లిఫ్టర్కు గోల్డ్ దక్కే అవకాశముంది!
స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ విభాగాల్లో 210 కేజీల బరువును ఎత్తి కొత్త ఒలింపిక్స్ రికార్డును సృష్టించింది చైనా రెజ్లర్ జిహుయ్ హౌ. అయితే ఆమెను యాంటీ డోపింగ్ అధికారులు పరీక్షించనున్నారు. అప్పటివరకు ఆమెను ఒలింపిక్ గ్రామంలోనే ఉండాల్సిందిగా ఆదేశించారు. ఒకవేళ ఆమె డోపీగా తేలితే హౌ పతకాన్ని వెనక్కి తీసుకుంటారు. ఇలా.. రెండో స్థానంలో ఉన్న చానుకు గోల్డ్ మెడల్ దక్కే అవకాశం ఉంది. ఇక మూడో స్థానంలో ఉన్న ఇండోనేసియా రెజ్లర్కు రజతం దక్కే అవకాశం ఉంది.