తెలంగాణ

telangana

ETV Bharat / sports

సింధు గొప్ప మనసు.. ఓడించిన తై జూకు ఓదార్పు

సాధారణంగా మనల్ని ఓడించిన వారు మరొకరి చేతిలో ఓడిపోతే.. ఎక్కడో లోలోపల ఆనందంగా ఉంటుంది కదూ! కానీ పీవీ సింధు అందుకు అతీతం. ఒలింపిక్స్​ లాంటి అతిపెద్ద వేదికలో సింధును ఓడించిన తై జూ యింగ్​.. ఫైనల్​లో పరాజయం పాలైన వేళ.. ఆమెలో మన తెలుగు తేజం స్ఫూర్తినింపింది. సింధు ప్రోత్సాహంతో భావోద్వేగానికి లోనైనట్టు స్వయంగా తై జూ చెప్పుకొచ్చింది.

Tokyo Olympics
టోక్యో ఒలింపిక్ లేటెస్ట్ న్యూస్

By

Published : Aug 2, 2021, 11:43 AM IST

అటు ఒలింపిక్స్​లో కాంస్యంతో భారత్​ పేరును మారుమోగించిన సింధు.. ఇటు తన ప్రవర్తనతో దేశానికి మరింత కీర్తిని తీసుకొచ్చింది. బ్యాడ్మింటన్​ మహిళల సింగిల్స్​ ఫైనల్​లో ఓడిపోయిన చైనీస్​ తైపీ క్రీడాకారిణి తై జూ యింగ్​లో స్ఫూర్తి నింపింది. ఇదే తైపీ ప్లేయర్​ చేతిలో సెమీస్​లో సింధు ఓడిపోయింది. అవేవీ పట్టించుకోకుండా.. ముందుకొచ్చి అండగా నిలిచింది. సింధు ప్రోత్సాహం తను దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నట్టు స్వయంగా తైజూ వెల్లడించింది.

ఇదీ జరిగింది..

ఒలింపిక్స్​ సెమీ ఫైనల్స్​లో తెలుగు తేజం సింధు, తై జూ యింగ్​ తలపడ్డారు. ఈ గేమ్​లో తైజు వ్యూహాత్మ ఆటతీరు ముందు సింధు తేలిపోయింది. దీంతో తై జూ ఫైనల్​కు ఆడే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత కాంస్యం కోసం పోటీపడ్డ సింధు.. బింగ్జియావో (చైనా)ను ఓడించి కాంస్య పతకాన్ని సాధించింది. అటు ఫైనల్​ చేరిన తైజూ మాత్రం.. చెన్ యూఫీతో తలపడింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఓడిపోయింది.

హృదయాలకు హత్తుకుని

ఆట అనంతరం బహుమతి పురస్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో పీవీ సింధు.. తై జూ యింగ్​ను హృదయానికి హత్తుకుని ప్రోత్సాహం అందించింది. ' నాకు అన్నీ తెలుసు. నువ్వు చాలా అలసిపోయావు. అయినప్పటికీ అద్భుతంగా ఆడావు. కానీ ఈ రోజు నీది కాదు,' అని ఓదార్చింది. దీంతో తై జూ భావోద్వేగానికి లోనైంది. 'సింధు ప్రోత్సాహం చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు' అంటూ చెప్పుకొచ్చింది తై జూ.

ఇదీ చదవండి:సైకత శిల్పంతో సింధుకు శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details