టోక్యో ఒలింపిక్స్‌లోని బాక్సింగ్ మహిళల ప్రీ క్వార్టర్స్‌లో ఓడి.. ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్. మూడు రౌండ్ల బౌట్లో రెండింట్లో గెలిచినా.. ఆమె ఓటమి పాలైంది. దీనిపై మేరీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తానే గెలిచినట్లు అనుకున్నానని, తనకు అన్యాయం జరిగిందని తెలిపింది.
ఇప్పుడు ఆమె చేసిన మరో ట్వీట్‌తో.. మేరీ కోమ్కు అన్యాయం జరిగినట్లే అనిపిస్తోంది. బౌట్‌కు నిమిషం ముందు.. తన రింగ్ డ్రెస్ మార్చుకోమన్నారని, ఇది ఆశ్చర్యంగా అనిపించిందని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఈ ట్వీట్‌కు పీఎంఓ ఇండియా, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకుర్, కిరణ్ రిజిజు, @ఒలింపిక్స్ ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్ చేసింది.
''ఆశ్చర్యమేస్తోంది.. అసలు రింగ్ డ్రెస్ అంటే ఏంటో ఎవరైనా చెబుతారా? నా ప్రీక్వార్టర్స్ బౌట్‌కు నిమిషం ముందు.. నా రింగ్ డ్రెస్‌ను మార్చుకోవాలని చెప్పారు. ఎందుకో ఎవరైనా చెబుతారా?''