తెలంగాణ

telangana

ETV Bharat / sports

Tokyo Olympics: కాంస్యం కోసం జర్మనీతో భారత్​ ఢీ

Team India
టీమ్ఇండియా

By

Published : Aug 3, 2021, 7:22 AM IST

Updated : Aug 3, 2021, 9:47 PM IST

17:33 August 03

కాంస్యం కోసం జర్మనీతో ఢీ..

ఒలింపిక్స్​ హాకీలో.. కాంస్య పతకం కోసం జర్మనీతో తలపడనుంది భారత్​. గురువారం(ఆగస్టు 5) ఉదయం 7 గంటలకు మ్యాచ్​ జరగనుంది. మంగళవారం జరిగిన సెమీస్​లో బెల్జియం చేతిలో 5-2 తేడాతో ఓడిపోయింది మెన్​ ఇన్​ బ్లూ. 

జర్మనీతో మ్యాచ్​లో గెలిస్తే.. కాంస్యం దక్కుతుంది.

రెండో సెమీస్​లో జర్మనీపై.. 3-1 తేడాతో గెలిచింది ఆస్ట్రేలియా. ఆగస్టు 5నే ఆస్ట్రేలియా- జర్మనీ మధ్య ఫైనల్​ మ్యాచ్​ జరగనుంది. 

16:35 August 03

షాట్​పుట్​లో విఫలం..

షాట్​పుట్​లో భారత అథ్లెట్​ తజిందర్​ పాల్​ సింగ్​ నిరాశపర్చాడు. మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్​ గ్రూప్​-ఏ నుంచి ఫైనల్​కు చేరుకోలేకపోయాడు. మూడు ప్రయత్నాల్లో తొలిసారి మాత్రమే గరిష్ఠంగా 19.99 మీటర్ల దూరం షాట్​పుట్​ విసిరాడు. మిగతా రెండు ప్రయత్నాల్లో నిర్దిష్ట మార్కును చేరుకోలేక విఫలమయ్యాడు. 

తొలి రౌండ్​ ముగిసేసరికి.. ఆరో స్థానంలోనే ఉన్నప్పటికీ, రెండో రౌండ్​లో కిందికి చేరాడు. మొత్తంగా 16 మందిలో 13వ స్థానంతో విశ్వక్రీడల నుంచి వైదొలిగాడు. 

15:41 August 03

దిల్లీ చేరుకున్న సింధు..

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు స్వదేశంలో అడుగుపెట్టింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సింధుకు అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోదీ, క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను కలవనుంది.

టోక్యో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో సింధు కాంస్య పతకం సాధించింది. దీంతో వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు అందుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం కైవసం చేసుకుంది. 

14:26 August 03

ఆగస్టు 16 స్వాతంత్య్ర దినోత్సవానికి ప్రత్యేక అతిథులుగా ఒలింపిక్స్​లో పాల్గొన్న క్రీడాకారులను ఆహ్వానించనున్నారు ప్రధాని మోదీ. ఈ సమయంలో ప్రతి ఒక్క అథ్లెట్​ను కలిసి మాట్లాడనున్నారు.   

09:17 August 03

సోనమ్ మాలిక్

సోనమ్ మాలిక్​కు నిరాశ

 ఫ్రీస్టైల్ రెజ్లింగ్​ పోటీల్లో భాగంగా మంగోలియా రెజ్లర్ బొలొర్తువాతో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్​లో ఓటమి పాలైంది భారత రెజ్లర్ సోనమ్ మాలిక్. తొలిసారి విశ్వక్రీడల్లో పాల్గొన్న సోనమ్ మొదటి మ్యాచ్​లోనే ఓడి నిరాశపర్చింది.

08:44 August 03

బెల్జియం జట్టు

భారత్ ఓటమి

టోక్యో ఒలింపిక్స్​లో భాగంగా బెల్జియంతో జరిగిన హాకీ సెమీ ఫైనల్ మ్యాచ్​లో ఓటమిపాలైంది భారత జట్టు. ప్రారంభంలో మెరుగ్గానే కనిపించిన టీమ్ఇండియా చివరి క్వార్టర్​లో చేతులెత్తేసింది. దీంతో 5-2 తేడాతో గెలిచి ఫైనల్​కు దూసుకెళ్లింది బెల్జియం. అయితే భారత్​కు కాంస్య పతకం గెలిచే వీలుంది. ఇందుకోసం మరో మ్యాచ్​లో తలపడాల్సి ఉంది. 

08:25 August 03

ఆధిక్యంలో బెల్జియం

కీలకమైన చివరి క్వార్టర్​లో రెండు గోల్స్​ చేసి భారత్​పై 4-2 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది బెల్జియం. ఫలితంగా ఈ మ్యాచ్ గెలవాలంటే భారత జట్టు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాల్సిందే.

08:15 August 03

ఆధిక్యం కోసం

మూడో క్వార్టర్​లో భారత్-బెల్జియం గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. కానీ ఎవ్వరూ గోల్ సాధించలేకపోయారు. దీంతో మూడో క్వార్టర్ ముగిసే సమయానికి రెండు జట్లు 2-2 గోల్స్​తో సమంగా ఉన్నాయి.

07:47 August 03

సగం ఆట పూర్తి

టోక్యో ఒలింపిక్స్​ హాకీ సెమీ ఫైనల్​ మ్యాచ్​లో భారత్-బెల్జియం హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇరుజట్లు దూకుడుగా ఆడుతూ గోల్స్​ కోసం ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఆటలో సగం సమయం పూర్తయ్యే సరికి ప్రస్తుతానికి 2-2 గోల్స్​తో సమంగా ఉన్నాయి రెండు జట్లు.

07:32 August 03

బెల్జియం గోల్

రెండో క్వార్టర్ 11 నిమిషాల వద్ద బెల్జియం మరో గోల్ చేసింది. దీంతో ప్రస్తుతం ఇరుజట్ల స్కోర్లు 2-2తో సమంగా నిలిచాయి. రెండు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

07:29 August 03

ఆధిక్యంలో భారత్

మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బెల్జియం గోల్ సాధించింది. అనంతరం దూకుడుగా ఆడిన టీమ్ఇండియా వరుసగా రెండు గోల్స్​తో ఆధిక్యంలోకి వెళ్లింది. మొదటి క్వార్టర్ పూర్తయ్యే సమయానికి భారత్​ 2 గోల్స్​తో ఉండగా బెల్జియం 1 గోల్​తో వెనుకంజలో ఉంది.

07:17 August 03

చరిత్ర ముంగిట

నయా చరిత్ర సృష్టించాలంటే భారత పురుషుల హాకీ జట్టు ఒక్క అడుగు వేస్తే చాలు. సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం అందించడానికి మన్‌ప్రీత్‌ సేన ముంగిట సువర్ణావకాశం. ప్రస్తుతం జరుగుతోన్న  సెమీఫైనల్లో ప్రపంచ ఛాంపియన్‌ బెల్జియంతో మన జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటిదాకా విశ్వక్రీడల్లో ఎనిమిది స్వర్ణాలతో సహా 11 పతకాలు భారత్‌ ఖాతాలో ఉండగా.. ఆ జాబితాలో మరో పతకం చేర్చాలని మన్‌ప్రీత్‌ బృందం ఉవ్విళ్లూరుతోంది. చివరిగా 1980 మాస్కో ఒలింపిక్స్‌ (స్వర్ణం)లో భారత్‌ పతకం సాధించింది. ప్రస్తుత క్రీడల్లో ఆస్ట్రేలియా చేతిలో 1-7తో చిత్తయిన తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్‌ ఆత్మవిశ్వాసంతో ఉంది. బెల్జియం ప్రపంచ నంబర్‌వన్‌ జట్టే అయినా ఫామ్‌, బలాబలాలు చూసుకుంటే రెండూ సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బెల్జియంతో గత అయిదు మ్యాచ్‌ల్లో మన్‌ప్రీత్‌ బృందం నాలుగింట్లో విజయం సాధించడం సానుకూలాంశం. 

07:14 August 03

అన్ను రాణి

నిరాశపర్చిన అన్ను రాణి

మహిళల జావెలిన్‌ త్రోలో భారత్‌కు నిరాశే ఎదురైంది. అర్హత పోటీల్లో అన్నురాణి విఫలమైంది. జావెలిన్‌ను 54.04 మీటర్లు విసిరి 14వ స్థానంలో నిలిచింది. మొదటి అవకాశంలో 50.35 మీటర్లు విసిరిన అన్ను రెండో సారి 53.19 మీటర్లు విసిరింది. ఇక ఆఖరి అవకాశంలో 54.04 మీటర్లు విసిరినా ఫలితం లేకుండా పోయింది. పొలాండ్‌ అమ్మాయి మరియా 65.24 మీటర్లు విసిరి ఫైనల్‌కు అర్హత సాధించింది.

Last Updated : Aug 3, 2021, 9:47 PM IST

ABOUT THE AUTHOR

...view details