ఒలింపిక్స్ చరిత్రలో ఒకేసారి ఏడు పతకాలు సాధించిన మహిళగా ఆస్ట్రేలియాకు చెందిన స్విమ్మర్ ఎమ్మా మెక్కియాన్ ఘనత సాధించింది. అంతకుముందు ఈస్ట్ జర్మన్ క్రిస్టిన్ ఓట్టో పేరిట ఉన్న ఆరు పతకాల రికార్డును కేలీ మెక్కియాన్ అధిగమించింది. 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన విశ్వక్రీడల్లో ఇంతటి ఘనత సాధించిన ఏకైక మహిళగా చరిత్ర పుటలకెక్కింది. ఆమె సాధించిన పతకాల్లో నాలుగు స్వర్ణ, మూడు కాంస్య పతకాలున్నాయి.
ఆదివారం జరిగిన మహిళల 4x100 మీటర్ల రిలే స్విమ్మింగ్ పోటీల్లో రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్ అయిన అమెరికా బృందాన్ని ఓడించి.. స్వర్ణ పతక విజేతలుగా ఎమ్మా మెక్కియాన్ బృందం నిలిచింది. 3:51.60 సమయంలో ప్రత్యర్థులను ఓడించిన ఆస్ట్రేలియన్ బృందం.. ఒలింపిక్స్లో రికార్డును నెలకొల్పింది. ఈ బృందంలో మెక్కియాన్తో పాటు చెల్సియా హాడ్జెస్, కేలీ మెక్క్వియాన్, కేట్ కాంప్బెల్ ఉన్నారు. ఆ తర్వాత వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్న అమెరికా 3: 51.73, కెనడా 3: 52.60 సమయంలో పూర్తి చేశారు.
టోక్యోలో ఎమ్మా మెక్కియాన్ సాధించిన పతకాలు..
- మహిళల 50మీ ఫ్రీస్టైల్ - స్వర్ణ పతకం
- మహిళల 100మీ ఫ్రీస్టైల్ - స్వర్ణ పతకం
- మహిళల 100మీ బటర్ప్లై - కాంస్య పతకం ఎమ్మా మెక్కియాన్
- మహిళల 4x100మీ రిలే ఫ్రీస్టైల్ (టీమ్ ఈవెంట్)- స్వర్ణ పతకం
- మహిళల 4x200మీ రిలే ఫ్రీస్టైల్ (టీమ్ ఈవెంట్) - కాంస్య పతకం
- మహిళల 4x100మీ రిలే మెడ్లే(టీమ్ ఈవెంట్) - స్వర్ణ పతకం
- మిక్స్డ్ 4x100మీ రిలే మెడ్లీ (టీమ్ ఈవెంట్) - కాంస్య పతకం స్విమ్మింగ్ బృందంతో ఎమ్మా మెక్కియాన్
స్విమ్మింగ్లో ఘనతలు