టోక్యో ఒలింపిక్స్‌లో రెండో పతకం కోసం భారత అథ్లెట్ల వేట కొనసాగుతోంది. విశ్వక్రీడలు మొదలైన రెండో రోజునే మీరాబాయి రజత పతకం సాధించగా.. ఇప్పుడు టోర్నీ 6వ రోజుకు చేరుకున్నా రెండో పతకం కోసం భారత ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. బుధవారం జరగనున్న పోటీల్లో స్టార్ అథ్లెట్లు పోటీ పడనున్నారు. వీరి ప్రదర్శనతోనైనా భారత్‌కు పతకం వస్తుందేమో చూడాలి.
టోక్యో ఒలింపిక్స్ ఆరో రోజున(జులై 28) భారత అథ్లెట్లు పాల్గొననున్న క్రీడలు.. వాటి వివరాలు..
ఆర్చరీ:
- తరుణ్‌దీప్ రాయ్ Vs ఓలెక్సీ హన్‌బిన్(ఉక్రేయిన్); పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ మ్యాచ్; ఉదయం 7.30 గంటలకు.
- ప్రవీణ్ జాదవ్ Vs గాల్సన్ బజార్జపోవ్(రష్యా ఒలింపిక్ కమిటీ); పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ మ్యాచ్; మధ్యాహ్నం 12.30 గంటలకు.
- దీపికా కుమారి Vs కర్మ(భూటాన్); మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ మ్యాచ్; మధ్యాహ్నం 2.15 గంటలకు.
బ్యాడ్మింటన్:
- పీవీ సింధు Vs ఎన్వై చేంగ్(హాంగ్ కాంగ్); మహిళల సింగిల్స్ గ్రూప్ జే మ్యాచ్; ఉదయం 7.30 గంటలకు.
- బీ సాయి ప్రణీత్ Vs ఎమ్ కాల్జౌ(నెదర్లాండ్); పురుషుల సింగిల్స్ గ్రూప్ డీ మ్యాచ్; మధ్యాహ్నం 2.30 గంటలకు.
బాక్సింగ్:
పూజా రాణి Vs ఇచ్రాక్ చైబ్ (అల్జీరియా); మహిళల 75 కేజీల విభాగంలో 16 బౌట్; మధ్యాహ్నం 2.30 గంటలకు.