టోక్యో ఒలింపిక్స్లో భారత షూటర్లు మరోసారి ఉసూరుమనిపించారు. 10మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో మను బాకర్- సౌరభ్ చౌదరీ జోడీ విఫలమైంది. మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్ స్టేజీ 1 మ్యాచ్లో అగ్రస్థానంలో నిలిచిన ఈ జంట.. స్టేజీ 2లో కొద్ది పాయింట్ల తేడాతో మెడల్ మ్యాచ్కు దూరమైంది.
క్వాలిఫికేషన్ స్టేజీ 2 ఈవెంట్లో ఈ ద్వయం 380 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో నిలిచింది. తొలి సిరీస్లో సౌరభ్ 96 పాయింట్లు సాధించగా, మను 92 పాయింట్లతో సరిపెట్టుకుంది. రెండో సిరీస్లో వరుసగా 98, 94 పాయింట్లు జోడించారు. మెడల్ మ్యాచ్కు అర్హత సాధించడానికి ఈ స్కోరు సరిపోలేదు. దీంతో మిక్స్డ్ ఈవెంట్లో భారత్ కథ ముగిసింది.