తెలంగాణ

telangana

By

Published : Jul 23, 2021, 9:27 PM IST

Updated : Jul 23, 2021, 10:53 PM IST

ETV Bharat / sports

ఒలింపిక్స్​లో రెండో రోజు.. బరిలో తెలుగు తేజాలు

టోక్యో ఒలింపిక్స్​ రెండో రోజున ఆర్చరీ, బ్యాడ్మింటన్​ సహా మరో ఎనిమిది క్రీడల్లో భారత అథ్లెట్లు పాల్గొననున్నారు. టెన్నిస్​, బ్యాడ్మింటన్​ తొలి రౌండ్లలో తెలుగు తేజాలు పోటీ పడనున్నారు. భారత క్రీడాకారులు ఆడే ఈవెంట్లు.. అవి ప్రారంభమయ్యే సమయం తెలుసుకుందాం.

Tokyo Olympics Day 2 India schedule
ఒలింపిక్స్​లో రెండో రోజే తెలుగు తేజాలు బరిలోకి..

టోక్యో ఒలింపిక్స్​లో రెండో రోజు(జులై 24) జరగనున్న 10 క్రీడల్లో భారత అథ్లెట్లు పాల్గొననున్నారు. అందులో ఆర్చరీ మిక్స్​డ్​ ఎలిమినేషన్​ రౌండ్​లో ప్రవీణ్​ జాదవ్​​, దీపికా కుమారి ఆడనున్నారు. మరోవైపు భారత పురుషుల హాకీ టీమ్​ న్యూజిలాండ్​ జట్టుతో పోటీ పడనుంది.

వీరితో పాటు మహిళల హాకీ, బాక్సింగ్​, బ్యాడ్మింటన్​, పెడ్లింగ్​, రోవింగ్​, షూటింగ్​, వెయిట్​ లిఫ్టింగ్​ వంటి క్రీడల్లో భారథ అథ్లెట్లు పాల్గొననున్నారు.

బరిలో తెలుగు తేజాలు

శనివారం జరగనున్న టెన్నిస్​ పోటీల్లో తెలుగు తేజాలు బరిలో దిగనున్నాయి. టెన్నిస్​ మహిళల డబుల్స్​లో సానియా మీర్జా, అంకితా రైనా ఆడనుండగా.. పురుషుల సింగిల్స్​లో సుమిత్​ నగాల్​ పోటీపడనున్నాడు.

మరోవైపు బ్యాడ్మింటన్​ డబుల్స్​లో సాత్విక్​ సాయిరాజ్​ రంకిరెడ్డి, చిరాగ్​ శెట్టి ద్వయం పోటీ పడనుంది. ఈ మ్యాచ్​ భారత కాలమానం ప్రకారం ఉదయం 8.50 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది. బ్యాడ్మింటన్​ పురుషుల సింగిల్స్​లో సాయప్రణీత్ ఆడనున్న మ్యాచ్​.. ​ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది.

టోక్యో ఒలింపిక్స్​ రెండో రోజు(జులై 24) భారత అథ్లెట్లు పాల్గొనే పోటీల షెడ్యూల్​

టోక్యో ఒలింపిక్స్​ రెండో రోజు షెడ్యూల్​
టోక్యో ఒలింపిక్స్​ రెండో రోజు షెడ్యూల్​
టోక్యో ఒలింపిక్స్​ రెండో రోజు షెడ్యూల్​
టోక్యో ఒలింపిక్స్​ రెండో రోజు షెడ్యూల్​
టోక్యో ఒలింపిక్స్​ రెండో రోజు షెడ్యూల్​
టోక్యో ఒలింపిక్స్​ రెండో రోజు షెడ్యూల్​
టోక్యో ఒలింపిక్స్​ రెండో రోజు షెడ్యూల్​
టోక్యో ఒలింపిక్స్​ రెండో రోజు షెడ్యూల్​

ఇదీ చూడండి..తొలి రోజు.. పతక వేటలో భారత ఆర్చర్లు

Last Updated : Jul 23, 2021, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details