తెలంగాణ

telangana

ETV Bharat / sports

Tokyo Olympics: కీలక సెమీస్​లో సింధు గట్టెక్కేనా?

ఒలింపిక్స్​లో.. మరో కీలక పోరుకు భారత స్టార్​ బ్యాడ్మింటన్​ ప్లేయర్​ పీవీ సింధు సన్నద్ధమవుతోంది. సింధు తలపడనున్న కీలక సెమీస్​ పోరు మధ్యాహ్నం 3:20కి ప్రారంభంకానుంది. అలాగే మరికొందరు భారత అథ్లెట్లు కూడా శనివారం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆ వివరాలు మీకోసం..

By

Published : Jul 31, 2021, 5:32 AM IST

Sindhu
సింధు

టోక్యో ఒలింపిక్స్​లో భారత బృందానికి 7వ రోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. షూటర్ మను బాకర్​, ఆర్చర్ దీపికా కుమారి, అథ్లెటిక్స్​లో ద్యుతికి ఓటమి ఎదురైంది. మరోవైపు పురుషుల హాకీ బృందం మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. అటు స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్​ ఫైనల్స్​లో సత్తా చాటి సెమీస్​కు దూసుకెళ్లింది. ఈ సెమీస్​ పోరు శనివారమే ఉండనుంది. అందులోను ప్రపంచ నెం.1 తై జూ యంగ్​తో. ఈ నేపథ్యంలో భారత బృందం షెడ్యూల్​కు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం..

టోక్యో ఒలింపిక్స్​లో భారత బృందం జులై 31 షెడ్యూల్

(భారత కాలమానం ప్రకారం)

  • ఈవెంట్​: గోల్ఫ్​- పురుషుల రౌండ్​ 2

అథ్లెట్​: అనిర్బన్​ లహిరి

సమయం: ఉదయం 4:15

  • ఈవెంట్​: అథ్లెటిక్స్​- మహిళల డిస్కస్​ త్రో క్వాలిఫికేషన్​ గ్రూప్​-ఏ

అథ్లెట్​: సీమా పునియా

సమయం: ఉదయం 6.00

  • ఈవెంట్​: గోల్ఫ్​- పురుషుల రౌండ్​ 3

అథ్లెట్​: అనిర్బన్​ లహిరి, ఉదయన్​ మానే

సమయం: ఉదయం 6.00

  • ఈవెంట్​: ఆర్చరీ- పురుషుల వ్యక్తిగత 1/8 ఎలిమినేషన్స్​

అథ్లెట్​: అతాను దాస్​

సమయం: ఉదయం 7:18

  • ఈవెంట్​: అథ్లెటిక్స్​- మహిళల డిస్కస్​ త్రో క్వాలిఫికేషన్​ గ్రూప్​ బీ

అథ్లెట్​: కమల్​ప్రీత్​ కౌర్​

సమయం: ఉదయం 7:25

  • ఈవెంట్​: బాక్సింగ్​- ప్రిలిమ్స్​ రౌండ్​ 16- పురుషుల 52కేజీ

అథ్లెట్​: అమిత్​ పంగల్​

సమయం: ఉదయం 7:30

  • ఈవెంట్​:షూటింగ్​- మహిళల 50మీ రైఫిల్​ 3 పొజిషన్స్​ క్వాలిఫికేషన్స్​

అథ్లెట్​: తేజస్విని సావంత్​, అంజుమ్​ మౌద్గిల్​

సమయం: ఉదయం 8:30

  • ఈవెంట్​: సెయిలింగ్- 49ఎర్​ పురుషుల రేస్​ 10,11,12​

అథ్లెట్​: కేసీ గణపతి, వరుణ్​ థాకర్​

సమయం: ఉదయం 8:35

  • ఈవెంట్​: హాకీ పూల్​ ఏ మ్యాచ్​

జట్లు: భారత మహిళలు X దక్షిణాఫ్రికా మహిళలు

సమయం: ఉదయం 8:45

  • ఈవెంట్​: ఆర్చరీ పురుషుల వ్యక్తిగత క్వార్టర్​ ఫైన్​ల్​- ఫైనల్​

అథ్లెట్​: అతాను దాస్​(క్వాలిఫై అయితే)

సమయం: ప్రకటించాల్సి ఉంది.

  • ఈవెంట్​: షూటింగ్​- మహిళల 50మీ రైఫిల్​ ఫైనల్​ 3 పొజిషన్స్​

అథ్లెట్​: క్వాలిఫై అయిన ప్లేయర్​

సమయం: మధ్యాహ్నం 12:30

  • ఈవెంట్​: బ్యాడ్మింటన్​- మహిళల సింగిల్స్​ సెమీస్​

అథ్లెట్​: పీవీ సింధు

సమయం: మధ్యాహ్నం 3:20

  • ఈవెంట్​: బాక్సింగ్​- మహిళల 75జేజీ, క్వార్టర్​ఫైనల్​ 4

అథ్లెట్​: పూజా రాణి

సమయం: మధ్యాహ్నం 3:36

  • ఈవెంట్​: అథ్లెటిక్స్​- పురుషుల లాంగ్​ జంప్​ క్వాలిఫికేషన్​ గ్రూప్​ బీ

అథ్లెట్​: శ్రీశంకర్​ మురళి

సమయం: మధ్యాహ్నం 3:40

ఇదీ చూడండి:-ఒలింపిక్స్​లో సింధు రికార్డు.. తొలి క్రీడాకారిణిగా!

ABOUT THE AUTHOR

...view details