కరోనా నేపథ్యంలో ఏడాది పాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ను(Olympics Closing Cenrmony) విజయవంతంగా నిర్వహించింది జపాన్ ప్రభుత్వం. 1964 తర్వాత రెండోసారి నిర్వహించిన జపాన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా క్రీడలను సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంది. విశ్వక్రీడలను నిలిపేయాలంటూ అక్కడి ప్రజల నుంచే వ్యతిరేకత లభించిన క్రమంలో కరోనా ఛాయలు లేకుండా ఆటలను నిర్వాహకులు ముగించారు.
టోక్యో ఒలింపిక్స్ ముగింపు వేడుక ముగింపు వేడుకలో భారత అథ్లెట్లు ఆదివారం రాత్రి ఈ క్రీడా సంరంభానికి ఘనంగా ముగింపు పలికారు. ఈ కార్యక్రమంలో భారత్ నుంచి దాదాపు 10 మంది అథ్లెట్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.
ఒలింపిక్స్ ముగింపు వేడుకలో క్రీడాకారుల కోలాహలం విద్యుత్ కాంతుల ప్రదర్శన అలరించింది. అన్ని దేశాల ఆటగాళ్లు.. తమ జాతీయ జెండాలను ప్రదర్శించారు. జులై 23న ప్రారంభమైన టోక్యో ఒలింపిక్స్.. ఆగస్టు 8 వరకు జరిగాయి.
ముగింపు వేడుకలో విన్యాసాలు పతకాల పట్టికలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. చైనా, జపాన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఏడు పతకాలు సాధించిన భారత్ 48 స్థానంతో ఒలింపిక్స్‌కు ఘనంగా వీడ్కోలు పలికింది.
టోక్యో ఒలింపిక్స్ ముగింపు వేడుక టోక్యో ఒలింపిక్స్ ముగింపు వేడుక టోక్యో ఒలింపిక్స్ ముగింపు వేడుక కరోనా నేపథ్యంలో ఏడాది పాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించారు. 1964 తర్వాత రెండోసారి నిర్వహించిన జపాన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా 17 రోజుల పాటు క్రీడలను సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంది. ముగింపు వేడుకల సందర్భంగా ఆదివారం టోక్యో స్టేడియంలో నిర్వహించిన విద్యుత్ కాంతుల ప్రదర్శన అలరించింది. జపాన్ క్రౌన్ ప్రిన్స్ అకిషినో, అంతర్జాతీయ ఒలింపిక్స్ అధ్యక్షుడు థామస్ బాక్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
పతకాల వేటలో..
ఈ క్రీడల్లో భారత్ ఎప్పడూ లేని విధంగా ఏడు పతకాలతో (1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలు) ముగించింది. అంతకుముందు అత్యధికంగా లండన్ ఒలింపిక్స్‌లో (2012) 6 పతకాలొచ్చాయి. ప్రస్తుత ఒలింపిక్స్ పతకాల పట్టికలో 113 పతకాలతో(39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్యాలు) అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. 88 పతకాలతో(38 స్వర్ణాలు, 32 రజతాలు, 18 కాంస్యాలు) చైనా రెండో స్థానంలో ఉండగా.. ఆతిథ్య దేశం జపాన్ 58 పతకాలతో(27 స్వర్ణాలు, 14 రజతాలు, 17 కాంస్యాలు) మూడో స్థానంలో ఉంది.
ఇదీ చూడండి..ఈ ఒలింపిక్స్‌లో 'భారత' పతక విజేతలు వీరే..