టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటి.. వెండి గెలిచిన మీరాబాయి చానుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా మీరాబాయికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
వెండి పతకం నెగ్గిన ఆమెకు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి భారత పతకాల పట్టికను తెరిచిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుకు హృదయపూర్వక అభినందనలు
- రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
''టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను అద్భుతమైన ప్రదర్శనతో యావత్ భారతం ఉప్పొంగిపోతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన ఆమెకు అభినందనలు. ఆమె విజయం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి దాయకం.''
-ప్రధాని మోదీ
ఒలింపిక్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను రజత పతకం సాధించడం గర్వంగా ఉంది. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలి.