తెలంగాణ

telangana

ETV Bharat / sports

Olympics: మనికా బాత్రా ప్రవర్తనపై ఫెడరేషన్​ సీరియస్ - manika batra

టేబుల్​ టెన్నిస్​ ఫెడరేషన్.. మనికా బాత్రాపై క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తీసుకోనుంది. ఒలింపిక్స్​లో ఆడిన ఆమె జాతీయ్​ కోచ్ సలహాలను తీసుకోకపోవడమే ఇందుకు కారణం.

manika
మనిక బాత్రా

By

Published : Jul 28, 2021, 10:25 AM IST

Updated : Jul 28, 2021, 10:54 AM IST

ప్రముఖ టీటీ ప్లేయర్ మనికా బాత్రాపై టేబుల్​ టెన్నిస్​ ఫెడరేషన్ క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్​లో ఆమె జాతీయ్​ కోచ్​ సౌమ్యదీప్​ రాయ్​ సలహాలు, సూచనలను తీసుకోకపోవడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని ఫెడరేషన్ సెక్రటరీ జనరల్​ అరుణ్​ కుమార్​ బెనర్జీ చెప్పారు.

"ఇది క్రమశిక్షణ ఉల్లంఘన చర్య. మిగతా ఆటగాళ్ల తరహాలోనే మనిక కూడా జాతీయ కోచ్​ సలహాలను తీసుకోవాలి. రాయ్​ భారత్​లో ఉన్న ఉత్తమ ఆటగాళ్లలో ఒకరు. త్వరలోనే వర్చువల్​గా ఎగ్జిక్యూటివ్​ బోర్డ్​ మీటింగ్​ జరుగుతుంది. ఈ సమావేశంలో ఆమెపై చర్యలు తీసుకునేలా నిర్ణయం తీసుకుంటాం"

-అరుణ్​ కుమార్​, టీటీఎఫ్​ఐ సెక్రటరీ జనరల్​.

బాత్రా ఒలింపిక్స్​కు తన వ్యక్తిగత కోచ్​ సన్మయ్​ మెగాక్రీడలకు తీసుకెళ్లాలని భావించింది. కానీ అందుకు నిర్వాహకులు ఒప్పుకోలేదు. దీంతో అసంతృప్తి చెందిన ఆమె.. మెగాక్రీడల్లో ప్రస్తుతమున్న కోచ్​ సాయం తీసుకోకుండానే ఒంటరిగా పోరాడింది. రాయ్​.. 2006 కామన్​వెల్త్​ గేమ్స్​ టీమ్​ ఈవెంట్​లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. అర్జున్​ అవార్డు కూడా ఆయనను వరించింది.

కచ్చితంగా పతకం సాధిస్తుందనే భారీ అంచనాలతో టోక్యో ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన మనిక బత్రా.. మహిళల సింగిల్స్​లో మూడో రౌండ్లో వెనుదిరిగింది. అనంతరం మిక్స్​డ్​ డబుల్స్​లోనూ శరత్​ అచంట-మనిక బాత్రా జోడీ చైనా ద్వయం లిన్​ యున్​ జు, చెంగ్​ ఐ చింగ్​ చేతిలో ఓటమి పాలై ఇంటిముఖం పట్టింది.

ఇదీ చూడండి:olympics live: పీవీ సింధు విజయం.. రౌండ్​-16కు అర్హత

Last Updated : Jul 28, 2021, 10:54 AM IST

ABOUT THE AUTHOR

...view details