టోక్యో ఒలింపిక్స్‌లో మూడో రోజు భారత అథ్లెట్ల నుంచి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు ప్రారంభ మ్యాచ్ గెలవగా.. మేరీ కోమ్ ప్రి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. ఇక షూటింగ్‌తో పాటు స్విమ్మింగ్‌లోనూ భారత క్రీడాకారులు నిరాశ పర్చారు. ఈ నేపథ్యంలో నాలుగో రోజుకు(జులై 26 సోమవారం) సంబంధించి భారత ఆటగాళ్ల షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి..
సోమవారం, జులై 26 (భారత కాలమానం ప్రకారం)
ఉదయం 05.30
- ఈవెంట్: ఫెన్సింగ్ (మహిళల సాబెర్ వ్యక్తిగత మ్యాచ్)
- అథ్లెట్లు:భవాని దేవి (ఇండియా ) X నదియా బెన్ అజిజి (ట్యూనీషియా)
ఉదయం 6.00
- ఈవెంట్:ఆర్చరీ (పురుషుల ఎలిమినేషన్స్)
- అథ్లెట్లు: ప్రవీణ్ జాదవ్, అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్(ఇండియా) X కజకిస్థాన్
ఉదయం 6.30
- ఈవెంట్: షూటింగ్ (పురుషుల స్కీట్ ఈవెంట్ డే2)
- అథ్లెట్లు:మైరాజ్ అహ్మద్ ఖాన్ - అంగడ్ వీర్ సింగ్ బాజ్వా
మధ్యాహ్నాం 12.20కు షూటింగ్ పురుషుల స్కీట్ ఫైనల్
- ఈవెంట్: టేబుల్ టెన్నిస్ (పురుషుల సింగిల్స్ 2వ రౌండ్ మ్యాచ్)
- అథ్లెట్లు:ఆచంట శరత్ కమల్ (ఇండియా) X టియాగో అపోలోనియా (పోర్చుగల్)
ఉదయం 07.30
- ఈవెంట్:టెన్నిస్ (పురుషుల సింగిల్స్ 2వ రౌండ్)
- అథ్లెట్లు:సుమిత్ నగాల్ (ఇండియా) X డానియల్ మెద్వెదెవ్ (రష్యా ఒలింపిక్ కమిటీ)
ఇదీ చదవండి:Olympics: బాక్సింగ్ ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన మేరీ కోమ్