భారత మహిళల హాకీ జట్టుకు బంపర్ ఆఫర్ ఇచ్చారు గుజరాత్ సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా. ఒలింపిక్స్‌లో పతకం గెలిస్తే.. ఇళ్లు లేని అథ్లెట్లకు తమ సంస్థ తరఫున రూ. 11 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. సొంత ఇళ్లు ఉంటే రూ. 5 లక్షలు విలువ చేసే కారు ఇస్తామని ప్రకటించారు.
"భారత మహిళల హాకీ జట్టును సత్కరించాలని హెచ్‌కే గ్రూప్ నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్‌లో మెడల్ గెలిస్తే.. సొంత ఇళ్లు కట్టుకోవాలని ఆశించిన అథ్లెట్లకు రూ. 11 లక్షలు బహుమతిగా ఇస్తాం. ఇతర అథ్లెట్లకు రూ. 5 లక్షలతో కారు ఇస్తాం. టోక్యో 2020లో మహిళలు చరిత్ర లిఖిస్తున్నారు. మహిళల హాకీ జట్టు తొలిసారిగా ఒలింపిక్స్‌లో సెమీస్‌లోకి చేరింది. ఇది గర్వించదగ్గ విషయం."