తెలంగాణ

telangana

ETV Bharat / sports

సుప్రీం ఆదేశంతో పారాలింపిక్స్​ బృందంలోకి షూటర్​ - పారాలింపియన్​ షూటర్​ నరేష్​ కుమార్​ శర్మ

టోక్యో పారాలింపిక్స్​ ఎంపికలో తనకు అవకాశం ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు భారత పారాలింపియన్​ షూటర్​ నరేశ్​ కుమార్​ శర్మ. త్వరలోనే పారాలింపిక్స్​ జరగనున్న క్రమంలో తన అభ్యర్థనను అత్యవసరంగా విచారించాలని నరేశ్​ తరఫున అడ్వొకేట్​ కోర్టుకు విన్నవించుకున్నారు. ఆ అభ్యర్థనను పరిశీలించిన సుప్రీంకోర్టు.. సదరు షూటర్​ను తక్షణమే పారాలింపిక్స్​ బృందంలో చేర్చుకోవాలని ఆదేశించింది.

Shooter seeks urgent hearing from SC on plea against his non-inclusion for Tokyo Paralympics
పారాలింపిక్స్​ బృందంలోకి షూటర్​.. సుప్రీం ఆదేశం

By

Published : Aug 2, 2021, 12:42 PM IST

Updated : Aug 2, 2021, 3:45 PM IST

త్వరలో జరగబోయే పారాలింపిక్స్​లో తనను ఎంపిక చేయకపోవడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు పారాలింపియన్​ షూటర్​ నరేశ్​ కుమార్ శర్మ. ఐదు సార్లు పారాలింపిక్స్​లో పాల్గొన్న తనను ఈసారి ఎంపిక చేయకపోవడంపై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించుకున్నారు.

అంతకుముందు దిల్లీ హైకోర్టులో షూటర్​ నరేశ్​ పిటిషన్​ దాఖలు చేయగా.. ఆ విచారణ ఆలస్యమై నేపథ్యంలో ఇప్పుడాయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. షూటర్​ తరఫున సీనియర్​ న్యాయవాది​ వికాస్​ సింగ్​ దాఖలు చేసిన పిటిషన్​ను ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ, జస్టిస్​ సూర్యకాంత్​ల ధర్మాసనం విచారణకు అంగీకరించింది.

తక్షణమే ఎంపిక చేయాలని అదేశం..

షూటర్​ అభ్యర్థనను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. పారాలింపిక్స్​ బృందంలో నరేశ్​ కుమార్​ శర్మను తక్షణమే చేర్చుకోవాలని ఆదేశించింది. దీంతో టోక్యోలో ఈ నెలాఖరున ప్రారంభం కానున్న పారాలింపిక్స్​లో పాల్గొననున్నారు.

ఇదీ చూడండి..దుమ్మురేపిన మహిళల హాకీ జట్టు.. క్వార్టర్స్​లో విజయం

Last Updated : Aug 2, 2021, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details