తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్స్​లో స్వర్ణం సాధిస్తే రూ.3 కోట్ల నజరానా

ఒలింపిక్స్​లో పతకం సాధించిన అథ్లెట్లకు భారీ నజరానా ప్రకటించింది భారతీయ రైల్వే శాఖ. రైల్వే శాఖ నుంచి విశ్వక్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు స్వర్ణం సాధిస్తే ఏకంగా రూ.3 కోట్లు పురస్కారంగా అందిస్తామని బుధవారం ప్రకటించారు అధికారులు.

Railways announces cash awards for its athletes, coaches participating in Tokyo Olympics
ఒలింపిక్స్​లో గోల్డ్​ మెడల్​ సాధిస్తే రూ.3 కోట్ల నజరానా

By

Published : Jul 28, 2021, 10:21 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొన్న అథ్లెట్లు, కోచ్​లకు భారతీయ రైల్వేశాఖ బంపర్​ ఆఫర్​ ప్రకటించింది. రైల్వేకు చెందిన క్రీడాకారులు విశ్వక్రీడల్లో స్వర్ణ పతకం సాధిస్తేవారికిరూ.3 కోట్ల రివార్డు ఇవ్వనున్నట్లు బుధవారం వెల్లడించింది.

"టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొన్న భారత రైల్వే క్రీడాకారులు, కోచ్​లలో ధైర్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక నగదు పురస్కారాలను ప్రకటిస్తున్నాం. విశ్వక్రీడల్లో బంగారు పతక విజేతలకు రూ.3 కోట్లు, రజత పతకానికి రూ.2 కోట్లు, కాంస్య పతకానికి రూ.1 కోటి నగదు రూపంలో రైల్వే అథ్లెట్లకు అందించనున్నాం. అదే విధంగా చివరి 8 స్థానాల్లో నిలిస్తే రూ.35 లక్షలను ప్రోత్సాహకంగా అందిచనున్నాం. ఒలింపిక్స్​లో పాల్గొన్న ప్రతి అథ్లెట్​కు రూ.7.5 లక్షలు పురస్కారంగా అందజేస్తాం".

- భారతీయ రైల్వేశాఖ ప్రకటన

బంగారు పతక విజేతల కోచ్​లకు రూ.25 లక్షలు, సిల్వర్​ రూ.20 లక్షలు, కాంస్య పతక విజేతల కోచ్​లకు రూ.15 లక్షలను బహుమానంగా ఇవ్వనున్నాం. మిగిలిన కోచ్​లకు రూ.7.5 లక్షలు అందజేయనున్నట్లు రైల్వే శాఖ ప్రకటనలో తెలిపింది. ఒలింపిక్స్​లో రైల్వే శాఖ నుంచి 25 మంది అథ్లెట్లు, ఐదుగురు కోచ్​లతో పాటు ఓ ఫిజియో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇదీ చూడండి..Tokyo Olympics: మేరీ కోమ్, సింధు రాణిస్తారా?

ABOUT THE AUTHOR

...view details