ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి పతకాన్ని సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఆదివారం జరిగిన బ్యాడ్మింటన్ కాంస్య పతక పోరులో చైనాకు చెందిన బింగ్జియావోపై గెలిచి పతకాన్ని దక్కించుకున్నారు. అంతటి విజయం తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు సింధు.
P.V. Sindhu: కాంస్యం గెలవడం సంతోషంగా ఉంది - పీవీ సింధు కాంస్య పతకం
టోక్యో ఒలింపిక్స్ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, కాంస్యం గెలవడం సంతోషంగా ఉందని స్టార్ షట్లర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు అన్నారు. సోమవారం ఆమె టోక్యో నుంచి కోచ్ పార్క్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
"కరోనా సమయంలో నా బలహీనతలపై దృష్టి పెట్టా. నాకు శిక్షణ ఇచ్చేందుకు కోచ్ పార్క్ ఎంతో కష్టపడ్డారు. డిఫెన్స్ మెరుగుపరుచుకోవడం వల్లనే పతకం సాధ్యమైంది. గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ ఎంతో ఉపయోగపడింది. దేశానికి పతకం తీసుకురావడం గర్వంగా ఉంది. అదే సమయంలో సెమీస్‌లో ఓడిపోవటం చాలా బాధగా అనిపించింది. సెమీస్‌లో ఓటమి సమయంలో భావోద్వేగానికి లోనయ్యా. కాంస్యం అవకాశం ఉందని సర్ది చెప్పుకొన్నా. పారిస్ ఒలింపిక్స్‌కు ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం విజయాన్ని ఆస్వాదిస్తున్నా. ఈ విజయాన్ని నా కుటుంబానికి, అభిమానులకు అంకితం చేస్తున్నా" అని సింధు చెప్పుకొచ్చారు.
ఇదీ చూడండి..సింధు గొప్ప మనసు.. ఓడించిన తై జూకు ఓదార్పు