టోక్యో ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకున్న స్టార్ షట్లర్ పీవీ సింధు.. రానున్న జనరేషన్‌కు ఈ మెడల్స్ స్పూర్తిగా నిలుస్తాయని చెప్పింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి బింగ్జియావోపై 21-13, 21-15పై గెలిచిన ఆమె.. వరుసగా రెండోసారి ఒలింపిక్స్ పతకం దక్కించుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో ఆమె రజతం దక్కించుకుంది. ఈ క్రమంలోనే వరుసగా రెండు పతకాలు సొంతం చేసుకున్న భారత తొలి క్రీడాకారిణిగా నిలిచింది.
"చాలామంది యువతీయువకులు.. ఈ పతకాల్ని చూసి స్పూర్తి పొందుతారు. ఒలింపిక్స్‌లో పాల్గొనేలా కష్టపడాతారు. చేయగలను, సాధించగలను అనుకుంటే ఎవరైనా గెలవగలరు" అని సింధు చెప్పింది. గత ఒలింపిక్స్ కంటే మెరుగైన పతకం సాధించనందుకు బాధపడుతున్నట్లు ఆమె తెలిపింది.