తెలంగాణ

telangana

ETV Bharat / sports

హాకీ క్రీడాకారులకు పంజాబ్​ ప్రభుత్వం భారీ నజరానా

టోక్యో ఒలింపిక్స్​లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ పురుషుల జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సందర్భంగా జట్టులోని పంజాబ్​ క్రీడాకారులకు ఆ రాష్ట్రం నజరానా ప్రకటించింది. తమ రాష్ట్రానికి చెందిన ప్రతి క్రీడాకారుడికి రూ.కోటి బహుమానంగా ఇవ్వనున్నట్లు క్రీడామంత్రి రాణా గుర్మీత్​ సింగ్​ సోధి ప్రకటించారు.

Punjab govt announces Rs 1 crore cash award for state players in bronze-winning men's hockey team
హాకీ క్రీడాకారులకు పంజాబ్​ ప్రభుత్వం నజరానా

By

Published : Aug 5, 2021, 2:29 PM IST

భారత హాకీ పురుషుల జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశం యావత్తు వారిని చూసి గర్విస్తోంది. ప్రస్తుతం పంజాబ్‌, హరియాణాల్లో ఆటగాళ్ల ఇళ్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. జట్టులోని పంజాబ్‌ ఆటగాళ్లు ఒక్కొక్కరికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించింది. ఆ రాష్ట్ర క్రీడా మంత్రి రాణా గుర్మీత్‌ సింగ్‌ సోధి ఈ విషయం ప్రకటించారు.

"భారత హాకీలో ఇదొక మరిచిపోలేని రోజు. పంజాబ్‌ నుంచి ప్రాతినిథ్యం వహించిన ప్రతి ఆటగాడికి కోటి రూపాయలు నజరానా ప్రకటించడం ఆనందంగా ఉంది. పతకంతో ఆటగాళ్లు ఎప్పుడెప్పుడు తిరిగొస్తారా అని ఎదురుచూస్తున్నాం."

- గుర్మీత్​సింగ్​, పంజాబ్​ రాష్ట్ర క్రీడామంత్రి

భారత హాకీ జట్టులో ఎనిమిది మంది పంజాబీలు ఉన్నారు. కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, రూపిందర్‌పాల్‌ సింగ్‌, హార్దిక్‌ సింగ్‌, శంషీర్‌ సింగ్‌, దిల్‌ప్రీత్‌ సింగ్‌, గుర్జంత్‌ సింగ్‌, మన్‌ప్రీత్‌ సింగ్‌ పంజాబ్‌కు చెందినవారే. స్వర్ణం గెలిస్తే ఒక్కొక్కరికి రూ.2.25 కోట్లు అందజేస్తామని ప్రభుత్వం మొదట ప్రకటించింది. ఇప్పుడు కాంస్యం తేవడం వల్ల కోటి రూపాయలు ఇవ్వనుంది.

ఇదీ చూడండి..తీరిన 41 ఏళ్ల కల.. టోక్యో ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టుకు కాంస్యం

ABOUT THE AUTHOR

...view details