టోక్సో ఒలింపిక్స్లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా చూపిన అసమాన ప్రతిభకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అతడు .. పురుషుల రెజ్లింగ్ 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో రజతం గెల్చుకున్నాడు.
టోక్యో ఒలింపిక్స్లో రవి దహియా రజతం పతకం సాధించటంపై దేశం గర్విస్తోంది. ఎన్నో క్లిష్టపరిస్థితులను ఎదుర్కొని నువ్వు విజయాన్ని దక్కించుకున్నావు. నువ్వొక నిజమైన ఛాంపియన్. భారత ఖ్యాతిని నలు దిశలా చాటిన నీకు శుభాకాంక్షలు.
-- రామ్నాథ్ కోవింద్, రాష్ట్రపతి
మోదీ ఫోన్..
టోక్యో ఒలింపిక్స్లో రజతం సాధించిన రవి దహియాకు ప్రధాని మోదీ.. ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు అతని కోచ్ అనిల్ మాన్తోనూ ఫోన్లో సంభాషించారు. అతని విజయం దేశానికి స్ఫూర్తినిస్తోందన్నారు. ఆగస్టు 15న తాను స్వయంగా రవిని కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
రవికుమార్ దహియా ఓ అసాధారణ మల్లయోధుడు. అతని పోరాటం అద్భుతం. ఒలింపిక్స్లో రజతం సాధించినందుకు శుభాకాంక్షలు. అతని విజయం దేశానికి గర్వకారణం.
-- ప్రధాని నరేంద్ర మోదీ