పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్‌లో రజత పతకాన్ని సాధించిన భారత క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వక్రీడల చరిత్రలోనే టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం వల్ల పలువురు ప్రముఖులు ఆమెను అభినందిస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా భవీనాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
"పారాలింపిక్స్‌లో రజత పతక సాధించిన భవీనా పటేల్.. టోక్యోలో ఉన్న భారత బృందంతో పాటు క్రీడాభిమానుల్లో స్ఫూర్తిని నింపింది. ఆమె అసాధారణ సంకల్పం, క్రీడానైపుణ్యాలు భారతదేశానికి కీర్తిని తెచ్చాయి. ఇంతటి గొప్ప విజయానికి మీకు(భవీనా) నా అభినందనలు".
- రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
"టోక్యో పారాలింపిక్స్ మహిళల టేబుల్ టెన్నిస్ విభాగంలో రజత పతకం సాధించిన భవీనా పటేల్‌కు అభినందనలు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణం. భవిష్యత్తులో ఆమె మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను".
- వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
"భవీనా పటేల్.. తన ప్రదర్శనతో చరిత్ర సృష్టించారు. పారాలింపిక్స్‌లో దేశం కోసం రజత పతకాన్ని సాధించారు. ఈ సందర్భంగా ఆమెకు నా అభినందనలు. ఈ విజయం ఎంతోమంది యువతలో స్ఫూర్తిని నింపి క్రీడల వైపు ఆకర్షిస్తుంది".