తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్​ బృందానికి రాష్ట్రపతి తేనీటి విందు - ఒలింపిక్ బృందంతో రాష్ట్రపతి

టోక్యో ఒలింపిక్స్​లో భారత బృందం అత్యుత్తమ ప్రదర్శనతో యావత్​ భారతావని గర్విస్తుందని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ పేర్కొన్నారు. విశ్వక్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఆయన శనివారం తేనీటి విందు ఇచ్చారు​.

president ramnath kovind
రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​

By

Published : Aug 14, 2021, 9:42 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేశారని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ ప్రశంసించారు. వారి ఆటతీరుతో యావత్​ భారతావని గర్విస్తుందని అన్నారు. టోక్యో గేమ్స్​లో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అథ్లెట్లకు మద్దతుగా నిలిచిన కోచ్​లు, సహాయక సిబ్బంది, కుటుంబ సభ్యులు, మొదలైన వారిని అభినందించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు.

విశ్వక్రీడల్లో పాల్గొన్న భారత ఆటగాళ్లకు రాష్ట్రపతి భవన్​లో తేనీటి విందు ఇచ్చారు కోవింద్. ఒలింపిక్స్​లో ఈసారి భారత బృందం అత్యధికంగా 7 మెడల్స్​ సాధించిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో యువత క్రీడల వైపు మొగ్గు చూపడానికి ఈ విషయం సహకరిస్తుందని పేర్కొన్నారు. పిల్లల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించే దిశగా తల్లిదండ్రుల్లోనూ మార్పు రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

"చాలా మంది ఆటగాళ్లు తమ కెరీర్​ ఆరంభంలోనే ఉన్నారు. వారందరూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. రాబోయే రోజుల్లో భారత అథ్లెట్లు ప్రపంచాన్ని ఆకట్టుకుంటారు."

-రామ్​నాథ్ కోవింద్, భారత రాష్ట్రపతి.

ఇదీ చదవండి:కాలు విరిగినా సరే.. పతకం సాధించాలనుకున్నా: బజ్​రంగ్

ABOUT THE AUTHOR

...view details