టోక్యో పారాలింపిక్స్(Tokyo Paralympics) బ్యాడ్మింటన్‌లో ఎస్ఎల్-3 విభాగంలో విజేతగా నిలిచిన ప్రమోద్ భగత్(Pramod Bhagat Badminton).. ఆ క్రీడలో స్వర్ణం పతకం సాధించిన భారత తొలి క్రీడాకారుడిగా నిలిచాడు. ఒడిశాలోని అట్టబిరా గ్రామానికి చెందిన ఇతడు.. ఐదేళ్ల వయసులోనే పొలియో(Pramod Bhagat Disability) బారినపడ్డాడు. అతడి ఎడమ కాలికి లోపం ఉన్నా.. బ్యాడ్మింటన్‌పై ప్రేమను వదులుకోలేదు.
క్రికెట్ అంటే ఇష్టమే!
చిన్నతనం నుంచి క్రికెట్‌ను ఇష్టపడిన ప్రమోద్.. ప్రాంతీయ టోర్నీల్లో ఓపెనర్‌గా బ్యాటింగ్ చేసేవాడు. వయసు పెరిగేకొద్ది బ్యాడ్మింటన్‌పై అవగాహన తెచ్చుకొని.. దానిపై ప్రేమతో పాటు నైపుణ్యాలను పెంచుకున్నాడు. 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పాఠశాల విడిచిపెట్టగానే.. అందరిలాగా టీవీకి అతుక్కుపోకుండా, తనకు ఇష్టమైన బ్యాడ్మింటన్ చూసేందుకు మైదానానికి వెళ్లేవాడినని ఓ ఇంటర్వ్యూలో ప్రమోద్ వెల్లడించాడు.
అలా బ్యాడ్మింటన్‌పై ప్రేమను పెంచుకొని.. తన పాఠశాలలో సీనియర్లతో సాధన చేయడం మొదలెట్టాడని అన్నాడు. ఆటలో తన ఎదుగుదలను చూసి అందరూ ఆశ్చర్యపోయారని చెప్పాడు. ఆ విధంగా జిల్లా స్థాయి పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచి.. అందరి దృష్టిని ఆకర్షించినట్లు వెల్లడించాడు. అనంతరం ఆ క్రీడలో ప్రొఫేషనల్‌గా ఎదగాలని భావించినట్లు పేర్కొన్నాడు.