టోక్యో ఒలింపిక్స్‌లో(Tokyo Olympics) స్వర్ణం సాధించిన జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్డా ఉపయోగించిన ఈటెకు ఈ-వేలంలో(Modi Gifts Auction) భారీ ధర లభించింది. ప్రధానమంత్రికి వచ్చిన బహుమతుల ఈ-వేలంలో భాగంగా నీరజ్‌కు, దేశానికి పసిడి పతకాన్ని అందించిన ఆ ఈటెను వేలానికి(Neeraj Chopra Javelin Auction) పెట్టగా.. రూ.కోటిన్నర ధర పలికింది. ఇక రెండు ఒలింపిక్స్ పతకాలు సాధించిన భారత తొలి మహిళగా నిలిచిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు రాకెట్‌కు రూ.80,00,100 ధర లభించింది.
టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో భారత్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన అథ్లెట్లు ప్రధాని మోదీకి బహూకరించిన క్రీడా పరికరాలతో పాటు ఆయనకు వివిధ సందర్భాల్లో వచ్చిన జ్ఞాపికలను ఆన్‌లైన్ వేదికగా వేలం(Modi Gifts Auction) వేసింది. కేంద్ర సాంస్కృతిక శాఖ pmmementos.gov.inలో ఈ వేలాన్ని నిర్వహించింది. మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబరు 17న మొదలైన ఈ-వేలం అక్టోబరు 7 గురువారంతో ముగిసింది. ఈ వేలంలో నీరజ్ ఈటె.. రూ.1.5కోట్లకు అమ్ముడైంది. ఈ-వేలంలో అత్యధిక ధర పలికిన వస్తువు ఇదే కావడం విశేషం. అయితే దీన్ని ఎవరు కొనుగోలు చేశారన్నది సాంస్కృతిక శాఖ బయట పెట్టలేదు. వేలం ఆరంభమైన రోజే ఈ ఈటెకు రూ.10 కోట్ల ధర పలికినప్పటికీ ఆ బిడ్ నకిలీదనే అనుమానంతో తొలగించారు.
భవానీదేవి కత్తికి రూ.1.25కోట్లు..