ఒలింపిక్స్ ఆటగాళ్లతో ప్రధాని ఆత్మీయ సమ్మేళనం ప్రధాని నరేంద్ర మోదీ భారత ఒలింపిక్స్ బృందంతో నిర్వహించిన ఆత్మీయ సమావేశం వీడియోను ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఈ భేటీలో ఉత్సాహంగా కనిపించిన మోదీ.. టోక్యో ఒలింపిక్స్‌లో వారి ప్రస్థానం గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.
ప్రధాని మోదీతో టోక్యో ఒలింపియన్లు ఒలింపిక్ పతక విజేతలతో ప్రత్యేకంగా మాట్లాడిన మోదీ.. వారు దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేశారని ప్రశంసించారు. అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించిన నీరజ్ చోప్రా.. ప్రధానికి తాను సంతకం చేసిన జావెలిన్‌ను బహూకరించారు. మీరాబాయి చాను, రవి దహియాలను మోదీ అభినందించారు.
ప్రధాని మోదీతో షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్ క్రీడాకారులతో ప్రధాని మోదీ రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు గెలిచిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించిన పీవీ సింధు.. ప్రధానికి షటిల్ రాకెట్ బహూకరించింది. దానిని తాను వేలం వేస్తానని మోదీ చమత్కరించగా.. సింధు సమ్మతించింది. మహిళా బాక్సర్ లవ్లీనా, రెజ్లర్ బజరంగ్ పూనియాలతోనూ మోదీ సరదగా ముచ్చటించారు. ఒలింపిక్స్ క్రీడాకారులు సంతకం చేసిన వస్త్రాన్ని సింధు.. మోదీకి బహూకరించారు.
మోదీకి బాక్సింగ్ గ్లౌవ్స్ బహుకరిస్తున్న బాక్సర్ లవ్లీనా ప్రధానికి హాకీ బ్యాట్‌ను బహుకరిస్తున్న మహిళా హాకీ జట్టు సభ్యులు 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాన్ని తీసుకొచ్చిన హాకీ జట్టు సభ్యులను.. మోదీ ప్రత్యేకంగా అభినందించారు. మోదీ హాకీ స్టిక్‌ను బహూకరించిన సభ్యులు.. అన్ని విధాల అండగా నిలిచినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఒలింపిక్స్‌లో కాంస్యంతో భారత హాకీ జట్టు రాబోయే తరానికి స్ఫూర్తి పంచిందని మోదీ కొనియాడారు.3
ఇదీ చదవండి :హాకీకి ఒడిశా అండ.. స్పాన్సర్‌గా మరో పదేళ్లు