టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్డాకు మహీంద్ర ఎక్స్‌యూవీ 700 కారు డెలీవరి అయింది. ఇచ్చిన మాట ప్రకారం ఆనంద్ మహీంద్ర.. జావెలిన్ ఎడిషన్ కారును నీరజ్‌కు పంపించారు. ఈ విషయాన్ని నీరజ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ, మహీంద్ర సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రకు ధన్యవాదాలు చెప్పాడు.
ఈ కారు కుడి భాగంలో బంగారు వర్ణంలో 87.58 అనే నంబర్‌తో పాటు జావెలిన్ వేస్తున్న చిన్న బొమ్మను ప్రత్యేకంగా అమర్చారు. 87.58 అనేది ఒలింపిక్స్‌లో నీరజ్, జావెలిన్ విసిరిన దూరం. దానిని ఇప్పుడు కారుపై అమర్చడం ఆకర్షణీయంగా అనిపిస్తోంది.
టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన క్రీడాకారులకు గుర్తుగా కొత్త ఎక్స్‌యూవీ 700 జావెలిన్ ఎడిషన్‌ను ఆవిష్కరించారు. ప్రస్తుతం 65 వేలకు పైగా బుక్సింగ్ నమోదు కాగా, వచ్చే ఏడాది జనవరి 14కల్లా కనీసం 14 వేల కార్లను అయినా డెలివరీ చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారు ధర రూ.12.49-రూ.22.89 లక్షల(ఎక్స్-షో రూమ్) మధ్య ఉంది.
రూ.కోటి నజరానా
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ కూడా గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్డాను సత్కరించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్‌కు రూ.కోటి బహుమతిగా ఇచ్చింది. ఈ మెగా క్రీడల్లో నీరజ్.. అత్యధికంగా జావెలిన్‌ను 87. 58 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం సాధించాడు. ఇందుకు గుర్తుగా.. 8758 నంబర్‌తో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీని నీరజ్‌కు ఇచ్చింది సీఎస్కే. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎస్కే సీఈఓ కాశి విశ్వనాథన్.. 'నీరజ్‌ను చూసి దేశం గర్వించిందని' చెప్పారు. స్పెషల్ జెర్సీని చోప్డాకు బహుమతిగా ఇవ్వడం ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు. కాగా, చెన్నై ఇచ్చిన బహుమానానికి ధన్యవాదాలు తెలిపాడు నీరజ్.
ఇవీ చదవండి: