తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్‌కు మరో రజతం.. హైజంప్‌లో మెరిసిన నిషాద్‌ కుమార్‌ - నిషాద్​ కుమార్​ టోక్యో పారాలింపిక్స్​

nishad
నిషాద్​

By

Published : Aug 29, 2021, 5:20 PM IST

Updated : Aug 29, 2021, 6:00 PM IST

17:18 August 29

నిషాద్​కు రజతం

టోక్యో పారాలింపిక్స్‌లో(Tokyo Paralympics) భారత్‌కు మరో రజత పతకం దక్కింది. ఆదివారం జరిగిన పురుషుల హైజంప్‌ పోటీల్లో టీ47 కేటగిరిలో భారత అథ్లెట్‌ నిషాద్‌కుమార్‌ 2.06 మీటర్ల ఎత్తు జంప్​ చేసి రెండో స్థానంలో నిలిచాడు. దాంతో అతడు రజతం సాధించాడు. ఇక ఈ పోటీల్లో పాల్గొన్న మరో భారత అథ్లెట్​ రామ్​ పాల్​ 1.94మీటర్ల ఎత్తు ఎగిరి ఐదో స్థానంలో నిలిచాడు.  

అమెరికాకు చెందిన టౌన్​సెండ్​ రొడిరిక్​ 2.15 మీటర్ల ఎత్తు ఎగిరి గోల్డ్​ మెడల్​ దక్కించుకోవడం సహా ప్రపంచ రికార్డు సాధించాడు. కాంస్యం కూడా ఆ దేశానికి చెందిన డల్లాస్​ వైస్​కు వరించింది.  

అంతకుముందు భారత టేబుల్​ టెన్నిస్​ క్రీడాకారిణి భవీనా పటేల్​ చరిత్ర సృష్టించింది. టోక్యో పారాలింపిక్స్​లో భారత్​కు తొలి పతకాన్ని అందించింది. పారాలింపిక్స్‌ చరిత్రలోనే టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం.

మోదీ శుభాకాంక్షలు 

రజతం గెలిచిన నిషాద్​కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. "టోక్యో నుంచి మరింత ఉత్సాహనిచ్చే వార్త. నిషాద్​కుమార్​ రజతం గెలవడం ఆనందంగా ఉంది. అతడు అసాధారణమైన నైపుణ్యం కలిగిన అథ్లెట్​. తనకు నా శుభాకాంక్షలు" అని మోదీ హర్షం వ్యక్తం చేశారు. 

Last Updated : Aug 29, 2021, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details