అదితి అశోక్.. రెండు, మూడు రోజుల ముందు వరకు భారతీయులకు పెద్దగా తెలియని పేరు ఇది. కానీ ఇప్పుడు అదితి పేరు మారుమోగిపోతోంది. ఒలింపిక్స్ గోల్ఫ్ పోటీల్లో అదితి(Aditi Ashok olympics 2021) పతకం సాధించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. తుపాను హెచ్చరికల మధ్య జరుగుతున్న ఈ ఈవెంట్లో అదితి గెలవాలని యావత్ ఇండియా ప్రార్థిస్తోంది. ఇక సామాజిక మాధ్యమాల్లో అదితిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇందులో కొన్ని ట్వీట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
"భారతీయులు ఉదయాన్నే లేచి.. గోల్ఫ్‌ను ఆసక్తిగా చూడటం బహుశా ఇదే తొలిసారేమో! చాలా మందికి కనీసం గోల్ఫ్ రూల్స్ కూడా తెలియవు. వారిలో ఇంత ఆసక్తి కలగడానికి కారణమైన అదితికి ధన్యవాదాలు" అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.