జావెలిన్ త్రోలో చారిత్రక స్వర్ణంతో సత్తాచాటుతూ భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్డా సాధించిన విజయం.. టోక్యో ఒలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పది అద్భుత సందర్భాల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది. ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య ఈ జాబితాను ప్రకటించింది.
నీరజ్ స్వర్ణ మెరుపులు.. ఒలింపిక్స్ అద్భుతాల్లో చోటు
టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచాడు నీరజ్చోప్డా. అతడు సాధించిన విజయం ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 10 అద్భుత సందర్భాల్లో ఒకటిగా నిలిచింది.
నీరజ్ చోప్రా
23 ఏళ్ల నీరజ్.. ఫైనల్లో జావెలిన్‌ను 87.58 మీటర్ల దూరం విసిరి అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి పసిడి అందించాడు. అభినవ్ బింద్రా (2008) తర్వాత విశ్వ క్రీడల్లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన భారత క్రీడాకారుడిగా అతను నిలిచాడు.
ఇదీ చూడండి:-నీరజ్ స్వర్ణం అందుకున్న రోజు.. ఇకపై ప్రతి ఏటా