అథ్లెటిక్స్‌లో తొలి ఒలింపిక్ పతకం కోసం భారతీయుల వందేళ్ల నిరీక్షణకు నీరజ్ చోప్డా(neeraj chopra gold medal) తెరదించాడు. విశ్వ క్రీడల్లో జావెలిన్ త్రోలో స్వర్ణం నెగ్గి భారతీయుల ముఖాల్లో ఆనందం నింపాడీ 23 ఏళ్ల హరియాణా కుర్రాడు. ఈ నేపథ్యంలోనే, తనకు ఇష్టమైన భారతీయ వంటకాల గురించి చోప్రా మాట్లాడాడు. పానీ పూరిలు, స్వీట్లు ఆరగించడం చాలా ఇష్టమని పేర్కొన్నాడు.
"పానీపూరి తినడం వల్ల ఎటువంటి హాని లేదని అనుకుంటున్నా. ఇందులో ఎక్కువగా నీరు ఉంటుంది. మన పొట్టలో అధిక భాగం నీటితో నిండి ఉంటుంది. పానీపూరి చూడటానికి పెద్దగా కనిపించినా దానిలో చాలా తక్కువ పిండి ఉంటుంది. ఎక్కువగా తింటున్నామని మీకు అనిపించినప్పటికీ వాటిని ఆరగించడం ద్వారా ఎక్కువ నీరు తీసుకుంటారు. వీటిని రోజూ తినాలని నేను సూచించను. అయితే, అప్పుడప్పుడు పానీపూరి తినడం మంచిదేనని ఒక అథ్లెట్‌గా అనుకుంటున్నా."
-నీరజ్ చోప్రా.