తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఖతర్నాక్ భాయ్.. సుమిత్​పై నీరజ్​ ప్రశంసలు - నీరజ్ చోప్డా ట్వీట్

టోక్యో పారాలింపిక్స్​లో స్వర్ణం సాధించిన సుమిత్(Sumith Javelin Throw)​ను కొనియాడాడు ఒలింపిక్స్​ జావెలిన్​ త్రో గోల్డ్​ మెడలిస్ట్ నీరజ్ చోప్డా(Neeraj Chopra Olympics). ఈమేరకు సుమిత్​ను పొగుడుతూ ట్వీట్ చేశాడు. భారత పారా అథ్లెట్ సుమిత్.. ఎఫ్​ 64 విభాగంలో 68.55 మీటర్ల దూరం విసిరి గోల్డ్​ మెడల్​ను కైవసం చేసుకున్నాడు.

neeraj chopra
నీరజ్ చోప్రా

By

Published : Aug 30, 2021, 8:40 PM IST

టోక్యో పారాలింపిక్స్​లో భాగంగా జావెలిన్​ త్రో పోటీల్లో స్వర్ణం సాధించిన సుమిత్ అంటిల్(Sumith Javelin Throw)ను ప్రశంసించాడు ఒలింపిక్స్​ గోల్డ్ మెడల్ విజేత నీరజ్ చోప్డా(Neeraj Chopra). 'అత్యుత్తమ ప్రదర్శన చేశావు సోదరా సుమిత్' అని ట్వీట్ చేశాడు. సుమిత్​ను చూసి గర్వపడుతున్నట్లు తెలిపాడు.

భారత పారా అథ్లెట్​ సుమిత్(Sumith Javelin Throw)​.. టోక్యో పారాలింపిక్స్​ జావెలిన్​ త్రోలో చరిత్ర సృష్టించాడు. ఎఫ్​ 64 విభాగంలో ఈటెను 68.55 మీటర్ల దూరం విసిరి గోల్డ్​ మెడల్​ను కైవసం చేసుకున్నాడు. తొలి రౌండ్​లోనే 66.95 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు సాధించాడు సుమిత్​. ఆ తర్వాత రెండో రౌండ్లో 68.08, ఐదో రౌండ్లో 68.55 మీట్లర్ల దూరం విసిరి మరోసారి తన రికార్డును తానే బద్దలుకొట్టి వరల్డ్​ రికార్డుకెక్కాడు.

గతంలో 2019లో దుబాయ్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్స్​లోనూ హరియాణా సోనేపట్​కు చెందిన సుమిత్​ రజత పతకం సాధించాడు. ఎఫ్​ 64 విభాగంలో ఈ పతకం సొంతం చేసుకున్నాడు.

ఇదీ చదవండి:టోక్యో పారాలింపిక్స్​లో భారత్​కు మరో స్వర్ణం

ABOUT THE AUTHOR

...view details