ప్రముఖ ఫార్మా సంస్థ మ్యాన్‌కైండ్ ఫార్మా.. ఉదారతను చాటుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో త్రుటిలో పతకాలు కోల్పోయిన 20 మంది భారత క్రీడాకారులను సన్మానించనుంది. వారి అంకిత భావం, కఠోర శ్రమకు గౌరవం ఇస్తూ.. మరింత ప్రోత్సాహం అందించే విధంగా ఒక్కొక్కరికి రూ. 11 లక్షల చొప్పున నజరానా ఇవ్వనుంది.
అథ్లెట్లు ఎదుర్కొనే, ఎదుర్కొంటున్న కష్టాలను తమ కంపెనీ అర్థం చేసుకుందని, వారిలో మరింత స్ఫూర్తి నింపేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు మ్యాన్‌కైండ్ ఫార్మా ఓ ప్రకటనలో తెలిపింది.
భారత మహిళల హాకీ జట్టులోని మొత్తం 16 మందికి.. రూ. 11 లక్షల చొప్పున అందించనుంది. ఇంకా.. బాక్సర్ సతీశ్ కుమార్, రెజ్లర్ దీపక్ పునియా, షూటర్ సౌరభ్ చౌదరీ, గోల్ఫర్ అదితి అశోక్‌కూ.. ఈ నగదు బహుమానం అందనుంది.
ఇదీ చూడండి: రెజ్లింగ్ కాంస్య పతక పోరులో దీపక్ పునియా ఓటమి
''దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటేనే ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని రావాలి. ప్రతి క్రీడలోనూ విజయమే ప్రామాణికం కాదు.''