Olympics: డిస్కస్ త్రోలో నిరాశపర్చిన కమల్‌ప్రీత్ కౌర్ - కమల్‌ప్రీత్ కౌర్ ఒలింపిక్స్
18:40 August 02
ఆరోస్థానంతో సరిపెట్టుకున్న కమల్‌ప్రీత్
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం సాధిస్తుందని ఆశించిన డిస్కస్ త్రో అథ్లెట్ కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్స్‌లో విఫలమైంది. మొత్తం 12 మంది పోటీపడిన ఈ పోటీల్లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. అమెరికా అథ్లెట్ అల్మన్ వాలరీ తొలి ప్రయత్నంలోనే 68.98 మీటర్లతో అందరికన్నా అత్యుత్తమ ప్రదర్శన చేసి స్వర్ణం సొంతం చేసుకుంది.
తర్వాతి రౌండ్లలో ఆమె విఫలమైనా చివరి వరకూ అదే మేటి స్కోరుగా నమోదవడం వల్ల బంగారు పతకం కైవసం చేసుకుంది.
ఈ క్రమంలోనే జర్మనీ అథ్లెట్ పుడెనెజ్ క్రిస్టిన్ ఐదో ప్రయత్నంలో 66.86 మీటర్ల ప్రదర్శనతో రజతం ఎగరేసుకుపోయింది. ఇక క్యూబా అథ్లెట్ పెరెజ్ యామి తొలి ప్రయత్నంలో సాధించిన 65.72 మీటర్ల ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం చేజిక్కించుకుంది. మరోవైపు సెమీస్‌లో 64 మీటర్లతో రెండో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత అథ్లెట్ కమల్‌ప్రీత్‌కౌర్ ఫైనల్లో మూడో ప్రయత్నంలో 63.70 ప్రదర్శన చేసింది. దాంతో సెమీస్ మార్కును కూడా ఆమె అందుకోలేకపోయింది.