తెలంగాణ

telangana

ETV Bharat / sports

Olympics: పతకాల పట్టికలో మళ్లీ అమెరికానే టాప్​.. భారత్​ ఎక్కడ? - ఒలింపిక్స్​ మెడల్స్​

కరోనా మహమ్మారిని అధిగమించి టోక్యో ఒలింపిక్స్​ను విజయవంతంగా ముగించింది జపాన్​ ప్రభుత్వం. అమెరికా, చైనా తీవ్రంగా పోటీపడినప్పటికీ.. మళ్లీ అగ్రస్థానం అగ్రరాజ్యాన్నే వరించింది. జపాన్​, భారత్​లు ఈ విశ్వక్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాయి. వాటి స్థానాలెంత?

Tokyo Olympics 2020
టోక్యో ఒలింపిక్స్​ 2020

By

Published : Aug 8, 2021, 6:26 PM IST

Updated : Aug 8, 2021, 8:23 PM IST

1964 తర్వాత రెండోసారి ఒలింపిక్స్​కు ఆతిథ్యమిచ్చిన జపాన్​ విశ్వక్రీడలను ఘనంగా ముగించింది. మరి ఇప్పుడు అందరి నోట ఏ దేశానికి ఎన్ని మెడల్స్​ వచ్చాయి. ఏ దేశం ఎక్కువ స్వర్ణాలు సాధించింది. అగ్రస్థానంలో ఎవరున్నారనే చర్చలే.

పతకాల పట్టిక

నిన్నటివరకు పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చైనాను దాటేసి ఈసారి కూడా అమెరికానే టాప్​లో నిలిచింది. 39 స్వర్ణాలు, 41 వెండి, 33 కాంస్యాలు.. మొత్తంగా 113 మెడల్స్​తో అగ్రరాజ్యం తొలి స్థానాన్ని దక్కించుకుంది. 38 పసిడి పతకాలతో పాటు 32 రజతాలు, 18 కాంస్యాలు మొత్తం 88 పతకాలతో చైనా రెండో స్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే తొలి రెండు స్థానాల్లో అమెరికా, చైనానే నిలిచాయి.

సొంతగడ్డపై జరిగిన ఒలింపిక్స్​లో జపాన్​ అథ్లెట్లు సత్తా చాటారు. ఈసారి అత్యధికంగా ఆ దేశం 27 స్వర్ణాలు, 14 రజతాలతో పాటు 17 కాంస్యాలు గెలుపొందింది. మొత్తంగా 58 పతకాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 1964, 2004 ఒలింపిక్స్​ల్లో 16 గోల్డ్​ మెడల్స్​ చొప్పున గెలుపొందిన జపాన్​.. గత రియో విశ్వక్రీడల్లో 12 బంగారు పతకాలు తన ఖాతాలో వేసుకుంది.

భారత అథ్లెట్లు

పతకాల పట్టికలో గ్రేట్​ బ్రిటన్​ నాలుగో స్థానంలో నిలిచింది. 22 పసిడి, 21 వెండి, 22 కంచు పతకాలు ఆ దేశ అథ్లెట్లు గెలుపొందారు.

ఇక భారత్​.. ఒక స్వర్ణం, రెండు రజతాలు, 4 కాంస్యాలతో ఈ జాబితాలో 48వ స్థానంలో నిలిచింది. 2012 లండన్ విశ్వక్రీడల్లో 6 పతకాలు గెలుపొందింది. తాజాగా ఆ సంఖ్యను అధిగమించింది భారత్​.​

పతకాలు సాధించిన భారత అథ్లెట్లు

ఇదీ చదవండి:ఒలింపిక్స్​ విజేతలకు నజరానా.. ఏ దేశంలో ఎంత?

Last Updated : Aug 8, 2021, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details