రాసిపెట్టి ఉంటే.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మనం అనుకున్నది కచ్చితంగా జరుగుతుందని జమైకన్ అథ్లెట్ హన్స్లే పార్చ్మెంట్కు జరిగిన ఓ సంఘటన మరోమారు నిరూపిస్తోంది. టోక్యో ఒలింపిక్స్ పురుషుల 110మీటర్ల హర్డిల్స్ రేస్‌లో స్వర్ణంతో మెరిశాడు హాన్స్లే. అయితే ఓ సందర్భంలో అతడు అసలు సెమీస్ ఆడలేని పరిస్థితి నెలకొంది. ఓ వాలంటీర్ సాయంతో పరిస్థితి నుంచి గట్టెక్కి.. చివరికి గోల్డ్ గెలిచాడు. ఈ విషయాన్ని హాన్స్లే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్(Hansle Parchment instagram) చేశాడు.
అసలేం జరిగిందంటే..
"ఇది సెమీస్ సమయంలో జరిగింది. చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్నా. 'ట్రాక్ అండ్ ఫీల్డ్' అని రాసుందని ఓ బస్సు ఎక్కా. ఇయర్‌ఫోన్స్ వల్ల బస్సులో మాటలు వినపడలేదు. కొద్దిసేపటికి వేరే మార్గంలో వెళుతున్నట్టు అర్థమైపోయింది. చుట్టుపక్కన ఏవీ తెలియవు. అలా బస్సు ఎక్కి వేరే స్టేడియానికి వెళ్లిపోయా. అక్కడ రోయింగ్ పోటీలు జరుగుతున్నట్టు ఉన్నాయి. అక్కడ అడిగితే.. మళ్లీ ఒలింపిక్స్ గ్రామానికి వెళ్లి.. అక్కడి నుంచి ఇంకో బస్సు ఎక్కాల్సిందే అన్నారు. నేను అది చేసుంటే.. అస్సలు సమయం ఉండేది కాదు. ఒలింపిక్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్యాక్సీ తీసుకునేందుకు ప్రయత్నించా. కానీ దొరకలేదు అప్పుడే ఓ వాలంటీర్‌ను చూశా. ఆమె నాకు ట్యాక్సీ తీసుకొచ్చింది. డబ్బులు కూడా ఇచ్చింది. అలా సమయానికి సరైన స్టేడియంకు వెళ్లగలిగా. ప్రాక్టీస్ చేయగలిగా. ఆమె వల్లే నాకు గోల్డ్ వచ్చింది."