తెలంగాణ

telangana

By

Published : Aug 1, 2021, 8:44 PM IST

ETV Bharat / sports

Olympics: 100 మీటర్ల పరుగులో బోల్ట్​ వారసుడు అతడే

ఒలింపిక్స్​లో సరికొత్త ఛాంపియన్​ వచ్చేశాడు. టోక్యోలో జరిగిన 100 మీటర్ల పరుగులో ఇటలీకి చెందిన లామోంట్ మార్సల్ జాకబ్స్ విజేతగా నిలిచాడు. గత కొన్ని ఒలింపిక్స్​లో ఈ విభాగంలో బోల్ట్​ స్వర్ణ పతకాలు గెలుస్తూ వచ్చాడు.

Italian Jacobs takes surprising gold in Olympic 100
లామోంట్ మార్సల్ జాకబ్స్

ఒలింపిక్స్‌లో సంచలనం. ప్రపంచంమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 100 మీటర్ల పరుగు పందెంలో ఎవరి ఊహకూ అందని రీతిలో ఇటలీకి చెందిన అథ్లెట్‌ లామోంట్‌ మార్సెల్‌ జాకబ్స్‌ విజయం సాధించాడు. కేవలం 9.80 సెకన్లలో అతడు గమ్యాన్ని చేరుకున్నాడు. ఆ తర్వాత అమెరికాకు చెందిన ఫ్రెడ్‌ కెర్లీ(9.84 సెకన్లు) రజతం, కెనడాకు చెందిన ఆండ్రీ డి గ్రాస్సే (9.89 సెకన్లు) కాంస్యం దక్కించుకున్నారు.

లామోంట్‌ మార్సెల్‌ జాకబ్స్‌ 1994 సెప్టెంబరు 24 అమెరికాలోని టెక్సాస్‌లో పుట్టాడు. అతడి తల్లి వివియానా ఇటలీకి చెందిన వారు. తండ్రి అమెరికన్‌. జాకబ్‌ తండ్రి యూఎస్‌ ఆర్మీలో పనిచేసేవారు. వృత్తి రిత్యా ఆయన సౌత్‌ కొరియాకు వెళ్లిపోయారు. దీంతో జాకబ్‌ను తీసుకుని ఆమె తల్లి వివియానా ఇటలీకి వచ్చేసింది. మార్సెల్‌కు చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఇష్టం. అతను అథ్లెట్‌ కాకముందు పలు క్రీడలపై ఆసక్తి పెంచుకున్నాడు. స్విమ్మింగ్‌, బాస్కెట్‌ బాల్‌ కూడా ఆడేవాడు. ఫుట్‌బాల్‌ సాధన చేస్తున్న క్రమంలో స్కూల్‌ కోచ్‌ పిలిచి 'నువ్వు చాలా వేగంగా ఉన్నావు. ఇంకేదైనా స్పోర్ట్స్‌లో ముఖ్యంగా అథ్లెట్‌ అయితే బాగుంటుంది' అని సలహా ఇచ్చారట. దీంతో మార్సెల్‌ లాంగ్‌ జంప్‌పై దృష్టి సారించాడు. అలా లాంగ్‌ జంప్‌లో శిక్షణ పొంది రాటు దేలాడు.

.

2016లో ఇటాలియన్‌ ఛాంపియన్‌షిప్‌ జరగ్గా అందులో 7.89 మీట్లర్లు దూకి విజయం సాధించాడు. అయితే, 2018లో అనూహ్యంగా 100మీటర్ల ట్రాక్‌పైకి వచ్చిన జాకబ్‌ సాధన చేయడం మొదలు పెట్టాడు. ఈలోగా కరోనా రావడం వల్ల ఇంటి వద్దే సాధన చేయాల్సి వచ్చింది. మళ్లీ 2021 సాధన మొదలు పెట్టిన జాకబ్స్‌ యూరోపియన్‌ ఇండోర్‌ ఛాంపియన్స్‌లో 60 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించాడు. ఆ తర్వాత సవోనాలో 100మీటర్లను 9.95 సెకన్లలో చేరుకుని సరికొత్త ఇటాలియన్‌ రికార్డు నమోదు చేశాడు.

ఈ ఒలింపిక్స్‌కు వచ్చే ముందు జాకబ్‌ మాట్లాడుతూ.. 'టోక్యోలో మెడల్‌ సాధించటానికి వెళ్తున్నా. ఎందుకంటే బోల్ట్‌ లేడు. కోల్‌మెన్‌ కూడా లేడు. 100 మీటర్ల పరుగులో హాట్‌ఫేవరెట్‌ ఎవరో తెలియదు. ఇదొక యుద్ధం. నేను కలలు కనడం కొనసాగుతుంది' అని అన్నాడు.

ABOUT THE AUTHOR

...view details