తెలంగాణ

telangana

ETV Bharat / sports

పారా-అథ్లెట్లకు ఘనస్వాగతం.. గురువారం మోదీతో భేటీ

పారాలింపిక్స్​లో(Tokyo Paralympics) పాల్గొన్న భారత అథ్లెట్ల చివరి బృందం స్వదేశానికి చేరుకుంది. బ్యాడ్మింటన్​, షూటింగ్​, ఆర్చరీ బృందాలకు(Indian Para Athletes) దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.

India's history-making Paralympians return to rousing reception
పారా-అథ్లెట్లకు ఘనస్వాగతం.. గురువారం మోదీతో భేటి

By

Published : Sep 6, 2021, 8:15 PM IST

టోక్యో పారాలింపిక్స్​లో(Tokyo Paralympics) పాల్గొన్న అథ్లెట్ల చివరి బృందం స్వదేశానికి చేరుకుంది. అందులో షూటింగ్​ సెన్షెషన్​ అవని లేఖరా, బ్యాడ్మింటన్​ ప్లేయర్​ సుహాస్​ యతిరాజ్​ ఉన్నారు. వీరంతా సోమవారం దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(సాయ్​) అధికారులతో పాటు వారివారి కుటుంబసభ్యులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.

దిల్లీ విమానాశ్రయంలో పారా-అథ్లెట్లు

సోమవారం స్వదేశం చేరుకున్న పారా-అథ్లెట్లలో(Indian Para Athletes) బ్యాడ్మింటన్​, షూటింగ్​, ఆర్చరీ బృందాలున్నాయి. టోక్యో పారాలింపిక్స్​లో పాల్గొన్న అథ్లెట్లతో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు.

.

టోక్యో పారాలింపిక్స్​లో భారత్.. 19 మెడల్స్​ సాధించిన పతకాల పట్టికలో(Indian Medals In Paralympics) 24వ స్థానానికి చేరుకుంది. అందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలున్నాయి.

.
దిల్లీ విమానాశ్రయంలో పారా-అథ్లెట్లు
దిల్లీ విమానాశ్రయంలో పారా-అథ్లెట్లు
దిల్లీ విమానాశ్రయంలో పారా-అథ్లెట్లు
దిల్లీ విమానాశ్రయంలో పారా-అథ్లెట్లు
.
.
.

ఇదీ చూడండి..కపిల్​దేవ్​ రికార్డును అధిగమించిన బుమ్రా

ABOUT THE AUTHOR

...view details