భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు మరోసారి అండగా నిలిచేందుకు సిద్ధమైంది ఒడిశా ప్రభుత్వం. ఇరు జట్లకు మరో పదేళ్ల పాటు స్పాన్సర్షిప్ను కొనసాగించనున్నట్లు ప్రకటించింది.
టోక్యో ఒలింపిక్స్ తర్వాత తొలిసారి తమ రాష్ట్రానికి వచ్చిన హాకీ జట్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది ఒడిశా ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో ఇరుజట్ల సారథులు రాణి రాంపాల్, మన్ ప్రీత్ సింగ్ను సత్కరించిన ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్.. తమ స్పాన్సర్షిప్ నిర్ణయాన్ని ప్రకటించారు.