భారత హాకీ జట్టు గోల్‌కీపర్ శ్రీజేష్‌కు కేరళ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో కీలకంగా వ్యవహరించి అద్భుత ప్రదర్శన చేసినందుకు శ్రీజేష్‌కు రూ.2 కోట్ల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. అలాగే అతడిని విద్యాశాఖలో జాయింట్ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు తెలిపింది.
హాకీ 'హీరో'కు ఉద్యోగంతో పాటు భారీ నజరానా
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం కోసం జర్మనీతో జరిగిన పోరులో విజయం సాధించింది భారత పురుషుల హాకీ జట్టు. ఇందులో కీలక పాత్ర పోషించిన గోల్‌కీపర్ శ్రీజేష్‌కు భారీ నజరానా ప్రకటించింది కేరళ ప్రభుత్వం.
శ్రీజేష్
కాంస్య పతక పోరులో భారత్, జర్మనీ ఇరుజట్లు గెలుపు కోసం భీకరంగా పోరాడాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 5-4 తేడాతో జర్మనీ జట్టును ఓడించింది. దీంతో 41 ఏళ్ల తర్వాత హాకీ జట్టు ఒలింపిక్స్ పోటీల్లో పతకాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో జర్మనీ జట్టు గోల్‌పోస్ట్ వద్ద పదేపదే దాడులు చేసినప్పటికీ గోల్‌కీపర్ శ్రీజేష్ అసమాన పోరాటపటిమను చూపి అడ్డుగోడగా నిలిచాడు.
ఇదీ చూడండి:-నీరజ్ స్వర్ణ మెరుపులు.. ఒలింపిక్స్ అద్భుతాల్లో చోటు
Last Updated : Aug 12, 2021, 12:00 PM IST