తెలంగాణ

telangana

ETV Bharat / sports

వందేళ్లకు అథ్లెటిక్స్​లో భారత్​కు పతకం.. నీరజ్​పై ప్రశంసల వెల్లువ - నీరజ్​ చోప్రాకు అభినందనల వెల్లువ

టోక్యో ఒలింపిక్స్​లో తొలి స్వర్ణం సాధించిన భారత అథ్లెట్​ నీరజ్​ చోప్రాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒలింపిక్స్​ అథ్లెటిక్స్​లోనూ 120 ఏళ్లలో భారత్​కు ఇదే తొలి పతకం. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు నీరజ్​పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

neeraj chopra
నీరజ్ చోప్రా

By

Published : Aug 7, 2021, 6:18 PM IST

Updated : Aug 7, 2021, 8:11 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు తొలి పసిడి వచ్చింది. జావెలిన్​ త్రోలో నీరజ్​ చోప్రా అత్యద్భుత ప్రదర్శన చేశాడు. రెండో రౌండ్​లో 87.58 మీ. దూరం బల్లెం విసిరి గోల్డ్​ మెడల్ సాధించాడు. దీంతో దేశవ్యాప్తంగా నీరజ్​పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

నీరజ్​ చోప్రా
వెండి, కాంస్య పతక విజేతలతో నీరజ్​ చోప్రా
స్వర్ణంతో నీరజ్​

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడల మంత్రి అనురాగ్​ ఠాకుర్​, పలువురు అతనికి అభినందనలు తెలిపారు.

"నీరజ్‌ చోప్రా.. ఇది అద్వితీయమైన గెలుపు. స్వర్ణ పతాకం సాధించి చరిత్ర సృష్టించావు. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొని భారత్‌కు పసిడి పతకం తీసుకొచ్చిన నీ ప్రతిభ.. ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకం. భారతదేశం.. నీ విజయానికి సంతోషిస్తోంది. హృదయపూర్వక అభినందనలు" అని రామ్​నాథ్​ కోవింద్​ ట్వీట్​ చేశారు.

రాష్ట్రపతి ట్వీట్​

"టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించారు. ఈరోజు నీరజ్ చోప్రా స్వర్ణం గెలవడం చిరకాలం గుర్తుంటుంది. చాలా చక్కగా రాణించాడు. ఒక ప్యాషన్‌తో తనదైన శైలిలో ఆడిన నీరజ్‌కు నా అభినందనలు" అని మోదీ ట్వీట్​ చేశారు.

ప్రధాని మోదీ ట్వీట్​

"భారత్​కు స్వర్ణం సాధించిన నీరజ్​ చోప్రాకు వంగి నమస్కరిస్తున్నా. దేశం గర్వపడేలా చేశావు" అని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ఇన్​స్టా వేదికగా పేర్కొన్నాడు.

ఇన్​స్టాలో రాహుల్ గాంధీ

"టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో విభాగంలో స్వర్ణం సాధించి తన గెలుపుతో నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు.ఇది గొప్ప విజయం. ఇన్నాళ్లు భారతీయులు వేచి చూస్తున్న స్వర్ణ పతక నిరీక్షణకు తెరపడింది" అని వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.​

ఉపరాష్ట్రపతి ప్రశంసలు

"నీరజ్​ చోప్రా.. పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు స్వర్ణం అందించాడు. ఇండియా గోల్డెన్​ బాయ్"​ అని అనురాగ్​ ఠాకుర్​ ప్రశంసించారు.

క్రీడల మంత్రి అనురాగ్​ ఠాకుర్​ ప్రశంసలు

"స్వర్ణం సాధించాలన్న దేశ ప్రజల కోరికను నువ్వు సాధించావ్‌ నీరజ్‌ చోప్రా. నీ విజయానికి నేను వంగి నమస్కరిస్తున్నా. పసిడి పతకాన్ని దేశానికి అందించినందుకు ధన్యవాదాలు. అలాగే గోల్డ్‌ క్లబ్‌కు వెల్‌కమ్‌. ఇలాంటి పతకాలు మరెన్నో తీసుకురావాలి. చాలా సంతోషంగా, గర్వంగానూ ఉంది" అని షూటర్​ అభినవ్​ బింద్రా పేర్కొన్నాడు.

బింద్రా ట్వీట్​
నీరజ్​ను ప్రశంసిస్తూ అభినవ్ బింద్రా లేఖ

"నీరజ్​ చోప్రా దేశం గర్వపడేలా చేశాడు. భారతీయ క్రీడకు ఇది మరిచిపోలేని క్షణం. యువ అథ్లెట్​కు అభినందనలు" అని దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​ ట్వీట్​ చేశాడు.

సచిన్ ట్వీట్​
Last Updated : Aug 7, 2021, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details