ఒలింపిక్స్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా అదరగొట్టింది. మహిళల హాకీ పూల్-ఏలో తన చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 4-3 తేడాతో గెలిచింది. క్వార్టర్ ఫైనల్ ఆశలను సజీవంగానే ఉంచుకుంది. ఈ క్రమంలో భారత్ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలవడం విశేషం.
విజయం అనంతరం భారత ఆటగాళ్ల సంబరాలు భారత్‌లో వందన కటారియా 3 గోల్స్ (4,17,49వ నిమిషాలు) చేసి.. విజయంలో కీలక పాత్ర పోషించింది. నేహా గోయల్ 32వ నిమిషంలో మరో గోల్ సాధించింది.
హ్యాట్రిక్ గోల్స్ చేసిన వందన కటారియా దక్షిణాఫ్రికా జట్టులో టారిన్ గ్లాస్బీ(15), ఎరిన్ హంటర్(30), మారిజెన్ మరియాస్(39ని.) తలో గోల్ కొట్టారు.
ఐర్లాండ్ ఓడితేనే..
ప్రస్తుతం 5 మ్యాచ్‌ల్లో రెండు గెలిచి.. ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది మెన్ ఇన్ బ్లూ. భారత్ క్వార్టర్స్ చేరాలంటే.. గ్రూప్ ఏ మరో మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్ చేతిలో ఐర్లాండ్ ఓడిపోవాలి. మ్యాచ్ డ్రా అయినా సరే.. మన జట్టు ముందుకెళ్తుంది.
విజయోత్సాహంలో టీమ్ ఇండియా శనివారం నిరాశేనా..?
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు శనివారం ఉదయం నిరాశాజనక ఫలితాలు వచ్చాయి. బాక్సింగ్‌లో ప్రపంచ నెం.1, భారత ఫేవరేట్ అమిత్ పంగాల్‌కు అనూహ్య ఓటమి ఎదురై.. నిష్క్రమించాడు. ఆర్చరీలో అతాను దాస్‌కు నిరాశే ఎదురైంది.
షూటింగ్ మహిళల 50.మీ. రైఫిల్ పొజిషన్స్‌లో అంజుమ్ మౌద్గిల్, తేజస్వినీ సావంత్ ఫైనల్‌కు చేరలేకపోయారు. వీరిద్దరూ వరుసగా 15,33 స్థానాల్లో నిలిచారు.
- మహిళల డిస్కస్ త్రోలో.. కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్‌కు చేరడమే భారత్‌కు సానుకూలాంశం.
- దిగ్గజ భారత డిస్కస్ త్రో అథ్లెట్.. సీమా పునియా కూడా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.
- శనివారం సాయంత్రం మరో రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో తై జు యింగ్‌తో (చైనీస్ తైపీ) పోటీపడనుంది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.
- బాక్సింగ్ 75 కేజీల మహిళల విభాగంలో.. క్వార్టర్ ఫైనల్ ఆడనుంది పూజా రాణి.
- వీరిద్దరూ తమ తమ మ్యాచ్‌ల్లో గెలిస్తే.. భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయమవుతాయి.
ఇదీ చూడండి: డిస్కస్ త్రో ఫైనల్లో కమల్‌ప్రీత్.. ఆర్చరీ, బాక్సింగ్‌లో నిరాశ