క్వార్టర్స్‌లో భారత మహిళల హాకీ జట్టు..
ఐర్లాండ్‌తో జరిగిన మహిళల హాకీ పోరులో గ్రేట్ బ్రిటన్ 0-2 తేడాతో గెలిచింది. ఫలితంగా మెరుగైన పాయింట్ల కారణంగా భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్స్‌లో బెర్తు ఖరారు చేసుకుంది.
18:44 July 31
క్వార్టర్స్‌లో భారత మహిళల హాకీ జట్టు..
ఐర్లాండ్‌తో జరిగిన మహిళల హాకీ పోరులో గ్రేట్ బ్రిటన్ 0-2 తేడాతో గెలిచింది. ఫలితంగా మెరుగైన పాయింట్ల కారణంగా భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్స్‌లో బెర్తు ఖరారు చేసుకుంది.
16:36 July 31
సింధు ఓటమి...
బ్యాడ్మింటన్ సెమీస్‌లో పీవీ సింధు ఓటమి పాలైంది. తాయ్‌పీ షట్లర్ తై జూ సింధుపై విజయం సాధించింది.
16:19 July 31
బ్యాడ్మింటన్ సెమీస్ హోరాహోరీ..
ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీస్ పోరు రసవత్తరంగా సాగుతోంది. తెలుగు తేజం పీవీ సింధు- తాయ్‌పీ షట్లర్ తై జూ యంగ్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. తొలి సెట్లో తై జూ గెలుపొందింది. అయితే సింధు కూడా గట్టిపోటీనిచ్చింది. ఫలితంగా 21-18తో తొలిసెట్‌ను తై జూ దక్కించుకుంది.
16:00 July 31
పూజా రాణి ఔట్..
11:21 July 31
షూటింగ్లో మళ్లీ నిరాశే..
షూటింగ్ మహిళల 50.మీ. రైఫిల్ 3 పొజిషన్స్‌లో భారత షూటర్లు నిష్క్రమించారు. కనీసం ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు.
10:33 July 31
హాకీలో మరో విజయం..
భారత మహిళల జట్టు హాకీలో మరో విజయం సాధించింది. పూల్ ఏ లోని తన చివరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 4-3 తేడాతో గెలిచింది టీమ్ ఇండియా. వందన కటారియా మూడు గోల్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించింది.
అయితే.. ఇవాళ జరిగే మరో మ్యాచ్‌లో ఐర్లాండ్ తన చివరి మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్ చేతిలో ఓడితేనే మన జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది.
ప్రస్తుతం భారత్.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మొత్తం ఆరు జట్లలో నాలుగు క్వార్టర్స్ చేరుతాయి.
08:17 July 31
ఫైనల్లో కమల్‌ప్రీత్ కౌర్..
మహిళల డిస్కస్‌త్రో ఫైనల్‌కు కమల్‌ప్రీత్ కౌర్ అర్హత సాధించింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లోని గ్రూప్ బిలో 2వ స్థానంలో నిలిచింది. మొత్తంగానూ రెండో స్థానమే. మొదటి ప్రయత్నంలో డిస్క్‌ను 60.29 మీటర్ల విసిరిన కమల్‌ప్రీత్.. రెండో ప్రయత్నంలో 63.97 మీటర్లు, మూడో ప్రయత్నంలో 64 మీటర్ల దూరం డిస్క్‌ను విసిరి, ఫైనల్‌కు అర్హత సాధించింది.
డిస్కస్ త్రో పోటీలో అమెరికా క్రీడాకారిణి అల్మన్ వలరీ తొలిస్థానంలో నిలిచింది. భారత్‌కు చెందిన మరో ప్లేయర్ సీమా పునియా 16వ స్థానంతో సరిపెట్టుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో తొలి 12 స్థానాల్లో నిలిచిన వారిని ఫైనల్‌కు ఎంపిక చేశారు. సోమవారం(ఆగస్టు 2) సాయంత్రం 4.30 గం.కు డిస్కస్ త్రో ఫైనల్ జరగనుంది.
07:43 July 31
భారత్‌కు షాక్.. బాక్సింగ్‌లో అమిత్ పంగాల్ ఓటమి..
బాక్సింగ్ పురుషుల 52 కేజీల విభాగంలో భారత ఫేవరేట్ బాక్సర్.. అమిత్ పంగాల్ ఓటమి పాలయ్యాడు. కొలంబియా బాక్సర్ మార్టినెజ్ రివాస్ చేతిలో 4-1 తేడాతో ఓడి క్వార్టర్స్ చేరకుండానే నిష్క్రమించాడు.
07:32 July 31
ఆర్చరీ ప్రీక్వార్టర్స్‌లో పోరాడి ఓడిన అతాను దాస్..
ఆర్చరీలో భారత ప్రస్థానం ముగిసింది. పురుషుల వ్యక్తిగత విభాగం ప్రీక్వార్టర్ ఫైనల్లో భారత ఆర్చర్ అతాను దాస్ పోరాడి ఓడాడు. జపాన్ ఆర్చర్ ఫురుకవా టకహరూ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు.
తొలి సెట్ గెలిచిన జపాన్ ఆర్చర్ 2 పాయింట్లు సాధించగా.. రెండో సెట్ టై అయింది. దీంతో స్కోరు 3-1గా ఉంది. తర్వాతి సెట్‌ను అతాను కైవసం చేసుకోగా.. స్కోరు 3-3తో సమమైంది. మళ్లీ నాలుగో సెట్ టై అయింది. కీలకమైన చివరిసెట్‌లో అతాను కంటే ఓ పాయింట్ ఎక్కువ స్కోర్ చేసి.. 6-4 తేడాతో మ్యాచ్ గెలిచాడు జపాన్ ప్లేయర్.
06:36 July 31
డిస్కస్ త్రో..
మహిళల డిస్కస్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్ ఏ లో .. భారత క్రీడాకారిణి సీమా పునియా డిస్క్‌ను 60.57 మీటర్ల దూరం విసిరింది. తొలి ప్రయత్నంలో విఫలమైన పునియా.. రెండో సారి ఈ లక్ష్యం చేరుకుంది. మూడో ప్రయత్నంలో 58.93 మీ. దూరం విసిరింది. ఎక్కువ దూరం విసిరిన వాటినే పరిగణనలోకి తీసుకుంటారు.
గ్రూప్ ఏ లో 15 మంది, గ్రూప్ బీ లో 16 మంది పోటీపడుతున్నారు. మొత్తంగా టాప్-12లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.
గ్రూప్ ఏలో పునియా ఆరో స్థానంలో నిలిచింది. క్రొయేషియా, జర్మనీ, జమైకా త్రోయర్లు వరుసగా తొలి, రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
06:09 July 31
Olympics Live: అమిత్, సింధు, అతానుపైనే అందరి దృష్టి
సింధు, అతాను, అమిత్‌లకు డూ ఆర్ డై..